ఎట్టకేలకు బుట్టా రేణుకను కరుణించిన జగన్... పార్టీ పదవితో సరి

By Siva KodatiFirst Published Aug 2, 2022, 7:00 PM IST
Highlights

మాజీ ఎంపీ బుట్టా రేణుకను కర్నూలు జిల్లా వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. దాదాపు మూడేళ్లు కావొస్తున్నా అధిష్టానం ఎలాంటి పదవిని ఇవ్వకపోవడంతో ఆమె అలకబూనినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే  జగన్ ఈ పదవితో రేణుకను సంతృప్తి పరిచినట్లుగా తెలుస్తోంది. 
 

సుదీర్ఘకాలంగా పదవి కోసం నిరీక్షిస్తోన్న మాజీ ఎంపీ బుట్టా రేణుకను (butta renuka) ఏపీ సీఎం, వైసీపీ (ysrcp ) అధినేత వైఎస్ జగన్ (ys jagan) ఎట్టకేలకు కరుణించారు. ఆమెను కర్నూలు జిల్లా (kurnool distrct) వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమించారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 

ALso REad:టీడీపీలో చేరి తప్పు చేశా, శిక్ష అనుభవించి పుట్టింటికి వచ్చా: వైసీపీలోకి ఎంపీ బుట్టా రేణుక

కాగా.. బుట్టా రేణుక 2014 ఎన్నికల సమయంలో వైసీపీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కర్నూలు నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత అనూహ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాకిస్తూ.. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. అయితే మళ్లీ 2019 ఎన్నికలకు ముందుకు తెలుగుదేశాన్ని వీడి సొంతగూటికి వచ్చేశారు. అలాగే గత ఎన్నికల్లో ఎలాంటి పదవిని ఆశించకుండా పార్టీ అభ్యర్ధుల విజయం కోసం శ్రమించారు. అయితే దాదాపు మూడేళ్లు కావొస్తున్నా అధిష్టానం ఎలాంటి పదవిని ఇవ్వకపోవడంతో ఆమె అలకబూనినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లా వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా బుట్టా రేణుకను జగన్ నియమించారు.

click me!