టిక్ టాక్ లో ఓ యువకుడు తనను మోసం చేశాడంటూ మంజుల అనే ఓ టిక్ టాక్ చేసే యువతి మదనపల్లె ప్రెస్ క్లబ్ ను ఆశ్రయించింది. విషయం ఏంటంటే.. టిక్‌టాక్‌లో పరిచయమైన ఓ యువకుడు ప్రేమ పేరిట తనను వంచించాడని తీరా పెళ్లి చేసుకుంటే ముఖం చాటేశాడని పేర్కొంది. ప్రేమికుడితో తనకు పెళ్లి చేయాలని కోరింది.

మంజుల కథనం ప్రకారం... వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన ఫొటోగ్రాఫర్ కమ్మరి బ్రహ్మయ్యతో పీలేరుకు చెందిన మంజులకు టిక్‌టాక్‌లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారితీసింది. కరోనా కారణంగా కమ్మరి బ్రహ్మయ్యకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో రూ.20,000 వరకు సాయం చేసింది.
undefined
మంజుల పెళ్లిచేసుకుందామని అడిగితే ఇంట్లో వాళ్లు అంగీకరించలేదని బ్రహ్మయ్య ముఖం చాటేశాడు. దీంతో ఆమె పీలేరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే, ఆధార్ కార్డు ప్రకారం అబ్బాయి వయస్సు 17 ఏళ్లు అని, వాళ్ల తల్లిదండ్రులు కేసు పెడితే మంజులకే ఇబ్బందులు తప్పవని ఎస్‌ఐ చెప్పాడట. దీంతో ప్రెస్ క్లబ్ ను ఆశ్రయించింది. అంతేకాదు నిజానికి కమ్మరి బ్రహ్మయ్య తనకంటే రెండేళ్లు పెద్దవాడని, పాస్‌పోర్ట్‌లో కచ్చితమైన వయస్సు నమోదైనట్లు ఆమె పేర్కొంది. ప్రేమ పేరుతో మోసం చేసిన బ్రహ్మయ్యతో తనకు వివాహం చేయించాలని కోరింది.
దీనిపై డీఎస్పీ రవిమనోహరాచారి మాట్లాడుతూ.. మంజులకు ఇలాంటి వ్యవహారాలు కొత్తేమీ కాదని చెప్పారు. అంతకుముందు కూడా ఇలాంటి కేసులు ఆమె పెట్టిందని చెప్పుకొచ్చారు. 2019 ఆగస్టు 15న ఆమె రాజ్‌కుమార్ అనే యువకుడిపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి అతడిని రిమాండ్‌కు పంపామన్నారు. ప్రస్తుతం మళ్లీ అదే తరహాలో ఫిర్యాదు చేస్తోందన్నారు. మంజులను బ్రహ్మయ్య మోసం చేసినట్లు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని, వివాహం చేయించమంటే అది తమ పరిధిలోని అంశం కాదని స్పష్టం చేశారు.