ఎన్డీఎలోకి వైఎస్ జగన్: క్లారిటీ ఇచ్చిన బిజెపి నేత

By telugu teamFirst Published Oct 7, 2020, 8:27 AM IST
Highlights

వైసీపీ ఎన్డీఎలో చేరుతుందనే ప్రచారంపై బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ అటువంటి ప్రచారం సాగడం వెనక వైసీపీ ఉందనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్డీఎలోకి ఆహ్వానిచినట్లు వచ్చిన వార్తలపై బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ స్పష్టత ఇచ్చారు. ఆయన మంగళవారం మీడియా సమావేశంలో ఆ విషయంపై మాట్లాడారు.

వైసీపీని ఎన్డీఎలోకి ఆహ్వానించినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఎన్డీఎ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో చేరితే రెండు క్యాబినెట్ మంత్రి పదవులు, ఓ సహాయ మంత్రి పదవి ఇవ్వడానికి ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధపడినట్లు వార్తలు వచ్చాయి. దానిపై మాధవ్ స్పష్టత ఇచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ వైసీపితో గానీ టీడీపీతో గానీ కలిసే పరిస్థితి లేదని మాధవ్ అన్నారు. ఈ విషయంపై తమ పార్టీ అధిష్టానం స్పష్టంగా ఉందని చెప్పారు. జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ ఎన్టీఎలోకి వైసీపి అనే ప్రచారం జరుగుతోందని, ప్రభుత్వంలో చేరాలని బిజెపి అడుగుతోందనే ప్రచారాన్ని వైసీపీనే చేస్తుందనే అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. 

Also Read:ఎన్డీఏలోకి వైసీపికి ఆహ్వానం: జగన్ కు మోడీ అఫర్లు ఇవే..

సీబీఐ కేసుల నేపథ్యంలో రకరకాల అంశాలు తెరపైకి తెస్తున్నారని,  మోడీ సానుకూలంగా ఉన్నారంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వంతో ఎలా ఉండాలో, వైసీపీ ప్రభుత్వంతోనూ అలానే ఉంటోందని ఆయన చెప్పారు.

click me!