అనుమానం... భార్యను డ్రైనేజీలోకి నెట్టి మరీ...

Published : Feb 20, 2020, 02:28 PM IST
అనుమానం...  భార్యను డ్రైనేజీలోకి నెట్టి మరీ...

సారాంశం

అనంతరం ఇద్దరూ కలిసి రమీజాను తమ ఇంటి ముందు ఉన్న డ్రైనేజీలో పడేశారు. ఈ క్రమంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన రమీజా రాత్రంతా డ్రైనేజీలోనే ఉండిపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు.. ఉదయం పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఆమెను ఆస్పత్రికి తరలించారు.

అనుమానం అతనిలోని మనిషిని చంపేసింది. భార్య పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో.. రాక్షసుడిలా మారాడు. ఏం  చేస్తున్నాడో కూడా తెలీకుండా ప్రవర్తించాడు. కట్టుకున్న భార్యపై అతి కిరాతకంగా దాడి చేశాడు. డ్రైనేజ్ లోకి పడేసి మరీ కొట్టాడు. ఈ దారుణ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.

Also Read వివాహేతర సంబంధం: కూరలో సైనైడ్ కలిపి భర్తకు వడ్డించిన భార్య, చివరకు...

పూర్తి వివరాల్లోకి వెళితే... నెల్లూరు జిల్లా కావలికి చెందిన షేక్‌ షరీఫ్‌, రమీజా భార్యభర్తలు. కొంతకాలం పాటు అన్యోన్యంగా సాగిన వీరి బంధంలో అనుమానం అనే పెనుబూతం దూరింది.కొద్దికాలంగా రమీజాపై అనుమానం పెంచుకున్న షరీఫ్‌ బుధవారం రాత్రి ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఇందుకు అతడి సోదరి కూడా సహకరించింది. 
అనంతరం ఇద్దరూ కలిసి రమీజాను తమ ఇంటి ముందు ఉన్న డ్రైనేజీలో పడేశారు. ఈ క్రమంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన రమీజా రాత్రంతా డ్రైనేజీలోనే ఉండిపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు.. ఉదయం పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రమీజా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!