
నూజివీడు : తనకు ఇవ్వాల్సిన 1000 రూపాయలను ఇవ్వమన్నందుకు వ్యక్తిని murder చేసిన ఘటన eluru జిల్లా నూజివీడు మండలం వెంకటాద్రిపురంలో ఆదివారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటాద్రిపురానికి చెందిన గొల్లపల్లె శ్రీనివాసరావు (45) మండలంలోని రావిచెర్లలో ఉన్న సిమెంట్ ఇటుక రాళ్ళ కంపెనీలో tractor driver పని చేస్తున్నాడు. ఇంటివద్ద అవసరమా రెండు వందల సిమెంటు రాళ్లను గతంలో తెచ్చుకుని ఉంచాడు. వాటిలో 50 రాళ్లను అదే గ్రామానికి చెందిన కూచిపూడి రంగా (30) అనే వ్యక్తి రెండు నెలల క్రితం తీసుకువెళ్ళాడు. వాటికి సంబంధించి రూ.1000 ఇవ్వాలని లేదంటే సిమెంట్ రాళ్లనైనా తిరిగి ఇచ్చేయమని శ్రీనివాసరావు అతడిపై ఒత్తిడి తీసుకు వస్తున్నాడు.
ఈ విషయమై ఇద్దరు పలుమార్లు గొడవ పడ్డారు. ఆదివారం సాయంత్రం కూడా ఇదే విషయమై వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రంగా సమీపంలో ఉన్న కర్రతో శ్రీనివాసరావుపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావును స్థానికులు హుటాహుటిన నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ ఊహించని ఘటన గ్రామంలో తీవ్ర సంచలనం కలిగించింది. రూరల్ ఎస్ఐ ఎం.లక్ష్మణ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో రౌడీషీటర్ పుట్టినరోజు వేడుకలు.. ఎస్సై సస్పెండ్..
కాగా, కొట్టి చంపిన వారిపై కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు, గ్రామస్తులు హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురం వద్ద వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం ఆందోళనకు దిగారు. రెండు గంటలపాటు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గ్రామస్థుల కథనం ప్రకారం... ధర్మసాగర్ మండలం ధర్మపురం గ్రామానికి చెందిన బొమ్మినేని విజేందర్ రెడ్డి (29), పుట్ట షణ్ముఖ రెడ్డి, మందపురి వంశీ, గై రాజేష్, మేకల రాజేందర్, కుక్కల వంశీ, నరేందర్ ఈ నెల 10వ తేదీన కరుణాపురం వద్ద మద్యం తాగారు.
ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ జరిగింది. ఘర్షణతో తనకు సంబంధం లేదని విజేందర్ రెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీంతో ఆగ్రహించిన మిగతా వారు ధర్మపురం వంతెన వద్ద అతడిని అడ్డగించి తీవ్రంగా కొట్టారు. ఈ గొడవలో విజేందర్రెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో 11వ తేదీన హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పోలీస్ స్టేషన్లో ఆరుగురు పేర్లతో బాధితుడి తండ్రి కొమ్మినేని రవీందర్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు మాత్రం ఇద్దరిపై కేసు నమోదు చేశారని ఆయన ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలో చికిత్స పొందుతూ విజేందర్ రెడ్డి శనివారం మృతి చెందాడు. దీంతో కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కరుణాపురం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ధర్మసాగర్, చిల్పూరు పోలీసులు, స్టేషన్గన్పూర్ ఏసిపి రఘు చందర్ వచ్చి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఆరుగురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతదేహాన్ని షణ్ముఖరెడ్డి ఇంటి ముందు ఉంచి ఆదివారం రాత్రి ఆందోళన చేశారు.