పంట నష్టపరిహారం ఎగ్గొట్టినా.. రుణమాఫీ చేయకున్నా ప్రశ్నించరు, మీ టార్గెట్ వైసీపీయే : పవన్‌కు పేర్నినాని కౌంటర్

Siva Kodati |  
Published : Jun 19, 2022, 09:10 PM IST
పంట నష్టపరిహారం ఎగ్గొట్టినా.. రుణమాఫీ చేయకున్నా ప్రశ్నించరు, మీ టార్గెట్ వైసీపీయే : పవన్‌కు పేర్నినాని కౌంటర్

సారాంశం

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆదివారం జరిగిన కౌలు రైతుల భరోసా యాత్ర సందర్భంగా వైసీపీపై, సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటరిచ్చారు. కౌలు రైతుల పట్ల మాకున్న చిత్తశుద్దిని శంఖించలేరని ఆయన పేర్కొన్నారు. 

అధికారంలో వున్నా, ప్రతిపక్షంలో వున్నా వైసీపీని (ysrcp) , వైఎస్ జగన్మోహన్ రెడ్డిని (ys jagan mohan reddy) ప్రశ్నించడమే పవన్ కల్యాణ్‌కు (pawan kalyan) వచ్చాంటూ చురకలు వేశారు మాజీ మంత్రి పేర్ని నాని (perni nani) . ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2016 నుంచి పంట నష్ట పరిహారం ఎగ్గొడితే మీరెందుకు ప్రశ్నించలేదన్నారు. రైతులకు ఒక్కసారైనా పవన్ గాని, బీజేపీ (bjp) గాని అండగా నిలబడ్డయా అని పేర్ని నాని ప్రశ్నించారు. కౌలు రైతులకు బీజేపీ ఏమైనా చేసిందా అని ఆయన నిలదీశారు. 

పవన్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలేనని.. మమ్మల్ని ప్రశ్నించే ముందు గతాన్ని ఓసారి గుర్తుచేసుకోవాలన్నారు. మీరు బలపర్చిన సర్కార్ రుణమాఫీగా అరకొర నిధులే ఇచ్చిందంటూ పేర్ని నాని దుయ్యబట్టారు. పీఎం కిసాన్ యోజనలో కౌలు రైతులు లేరనే విషయం పవన్‌కు తెలుసా అని ఆయన ప్రశ్నించారు. కౌలు రైతుల పట్ల మాకున్న చిత్తశుద్దిని శంఖించలేరని పేర్ని నాని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి ఒక్క పైసా అయినా అదనంగా తెచ్చారా అని మంత్రి ప్రశ్నించారు. సీఎం జగన్‌ను విమర్శించే అర్హత పవన్‌కు లేదన్నారు. 

అంతకుముందు వైసీపీ నేతలపై (YSRCP) మండిపడ్డారు జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) . కౌలు రైతు భరోసా యాత్రలో (janasena koulu rythu bharosa) భాగంగా ఆదివారం ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పర్చూరులో జరిగిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. ఏదైనా మాట్లాడితే దత్తపుత్రుడు అంటూ విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం జరగనప్పుడు ఎవరో ఒకరు ప్రశ్నించాలని, అందుకే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 

వెలిగొండ ప్రాజెక్ట్ (veligonda project) ఇంత వరకు పూర్తికాకున్నా అడిగే నాయకుల్లేరని ఆయన ధ్వజమెత్తారు. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం ముందుకు వెళ్లడం లేదని పవన్ అన్నారు. ఎమ్మెల్యేలకు కూడా డబ్బు మదమెక్కిందంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మిమ్మల్ని సీబీఐ దత్తపుత్రుడు అంటే సహించలేరని పవన్ దుయ్యబట్టారు. ఓదార్పు యాత్రలు చేసి ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చారంటూ జనసేనాని సెటైర్లు వేశారు. కేసులు వుంటే ఏ ఉద్యోగం రాదు.. మరి ఎమ్మెల్యేలకు ఇవి వర్తించవా అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. 

కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు వ్యవస్థలను ఉపయోగించరని ఆయన మండిపడ్డారు. కక్ష సాధింపు కోసమే వ్యవస్థల్ని వాడుతారంటూ పవన్ ఆరోపించారు. తనకు డబ్బు అవసరం లేదని.. వచ్చే ఎన్నికలు చాలా కీలకమైనవని ఆయన స్పష్టం చేశారు. జనసేన అధికారంలోకి రాగానే రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రతికూల పరిస్ధితుల్లోనే ఒకరి వ్యక్తిత్వం బయటపడుతుందని ఆయన అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్