విశాఖ పట్నం : బట్టలు అద్భుతంగా కుడతారని ఊహించడం.. కనీసం అందులో సగమైనా బాగా కుట్టకపోవడం.. పాడు చేయడం అత్యంత మామూలు విషయాలే. ఆ సమయానికి కోపం రావడం.. టైలర్ల మీద అరవడం గొడవ పెట్టుకోవడం, బట్టలు వాళ్లమీదే వేసి రావడం.. డబ్బులు ఇవ్వకపోవడం జరుగుతూనే ఉంటాయి. అయితే విశాఖపట్నంలో ఇందుకు భిన్నంగా జరిగింది. బట్టలు సరిగా కుట్టలేదని ఏకంగా టైలర్ ను హత్య చేశారు.
కొత్త దుస్తులు సరిగా కొట్టలేదని ఆగ్రహించిన ఇద్దరు వ్యక్తులు ఓ tailor పై attack చేయగా అతను చనిపోయిన ఘటన కలకలం రేపింది. ఈ విషాద దారుణ ఘటన visakhapatnamజిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పీఎం పాలెం పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి... ఒడిస్సా రాష్ట్రం పర్లాకిమిడికి చెందిన బుడు లిమా భార్య లక్ష్మి, కుమార్తె సుమంత, కొడుకు సుమన్ తో మారికవలస లోని రాజీవ్ గృహకల్ప జీఓఫ్-1 బ్లాక్ నెంబర్ 104లో నివసిస్తున్నాడు.
ఇంటివద్దనే లిమా Tailoring చేస్తుంటాడు. మిగతా కుటుంబ సభ్యులు కూలి పనులకు వెళ్తూ ఉంటారు. ఇదిలా ఉండగా కాలనీకి చెందిన గణేష్ లిమా వద్ద కొత్త దుస్తులు కుట్టించుకున్నాడు. కొలతల ప్రకారం సరిగా కుట్టకపోవడంతో సరిచేసి ఇవ్వాల్సిందిగా కోరాడు.
అయితే అనుకున్న సమయానికి దుస్తులు సరిచేసి ఇవ్వకపోవడంతో గణేష్ టైలర్ ను గట్టిగా ప్రశ్నించాడు. ఆ సమయంలో టైలర్ కుమార్తె, అల్లుడు సుశాంత్ ఇంట్లోనే ఉండడంతో గణేష్ వెళ్లిపోయాడు. అయితే గణేష్ తన మిత్రులు సూర్యనారాయణ, మరికొందరిని వెంట పెట్టుకుని తిరిగి వచ్చాడు. టైలర్ మీద విచక్షణారహితంగా గుండెలపై పిడి గుద్దులు గుద్దడంతో స్పృహ తప్పి పడిపోయాడు.
Road Accident in Vizag: విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు 108 వైద్య సిబ్బంది తెలిపారు.
ఇలాంటిదే మరో విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. కొత్త సంవత్సరం వేళ దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో పట్టలేని కోపంతో స్నేహితుడి మర్మాంగాన్ని కోసం పారిపోయాడో వ్యక్తి.. ఈ దారుణ ఘటన uttarpradesh లోని జర్వాల్ ఠాణా పరిధిలో వెలుగులోకి వచ్చింది. liquor మత్తులో ఓ వ్యక్తి స్నేహితుడి మర్మాంగాల్ని కోసేశాడు. నయీం అహ్మద్ (30), సులేమాన్ మంచి స్నేహితులు. ఒక పని నిమిత్తం... జల్వాల్ లో ఇద్దరూ కలిశారు. ఫూటుగా తాగాక conflict మొదలయ్యింది. వాగ్వాదం తీవ్రస్థాయికి చేరి సులేమాన్ కోపంతో రగిలిపోయాడు.
తన వద్ద ఉన్న పదునైన బ్లేడుతో నయీం అహ్మద్ మర్మాంగాన్ని కోసేశాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని పోలీసలు ముస్తాఫాబాద్ లోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందంటూ జిల్లా ఆస్పత్రికి సిఫార్సు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇంకా ఎలాంటి కేసు నమోదు చేయలేదు.