తిరుపతి జిల్లాలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. ప్రియురాలి తల్లిదండ్రులపై దాడి..

Published : Jul 17, 2023, 01:45 PM IST
తిరుపతి జిల్లాలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. ప్రియురాలి తల్లిదండ్రులపై దాడి..

సారాంశం

తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని డక్కిలి మండలంలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.

తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని డక్కిలి మండలంలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించడం లేదని.. ప్రియురాలి తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డాడు. వివరాలు.. గిరి అనే వ్యక్తి డక్కిలి మండల కేంద్రంలో తన ప్రియురాలు తల్లిదండ్రులు తులసి జగదీష్, సుజాతలపై దాడికి దిగాడు. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే జగదీష్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు  చెబుతున్నారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుందని వెల్లడించారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ప్రస్తుతం గిరి పరారీలో ఉన్నాడు. ఇక, గిరి స్వస్థలం శ్రీకాళహస్తి మండలంలోని వాగివేడుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

President Droupadi Murmu At Vijayawada Kanakadurga Devi Temple | Asianet Telugu
ద్రౌపదమ్మకు చీర బహుమతిగా ఇచ్చిన అనితమ్మ | Asianet Telugu