తోపులాట, రద్దీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కరోనా టీకాలకు బ్రేక్

By telugu teamFirst Published May 10, 2021, 10:56 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు, రేపు కరోనా వ్యాక్సినేషన్ ఆగిపోనుంది. రద్దీ, తోపులాట నేపథ్యంలో జగన్ ప్రభుత్వం వ్యూహం మార్చి పక్కా ప్రణాళికతో వాక్యినేషన్ ప్రక్రియను అమలు చేయాలని నిర్ణయించింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ఆగిపోయింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా టీకాలు ఇవ్డాన్ని నిలిపేశారు. వ్యాక్సిన్ కోసం రద్దీ, తోపులాటలు చోటు చేసుకోవడంతో టీకాలు ఇవ్వడాన్ని ఆపేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది. 

రద్దీ, తోపులాటలు చోటు చేసుకుండడంతో టీకాలు ఇవ్వడానికి పక్కా ప్రణాళికను రూపొందించి అమలుచేయాలని తలపెట్టింది. దీంతో కరోనా వ్యాక్సినేషన్ ను తాత్కాలికంగా ఆపేసింది. తన వ్యూహాన్ని మార్చి కొత్త ప్రణాళికను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఓటరు లిస్టు తరహాలో టీకాలు తీసుకోవడానికి స్లిప్పులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఎవరికి ఏ సమయంలో టీకాలు ఇవ్వాలనేది నిర్ణయించి ఇళ్లకే స్లిప్పుల ద్వారా పంపించాలని నిర్ణయించింది. ఎస్ఎంఎస్, ఆశావర్కర్ల ద్వారా స్లిప్పులను పంపిణీ చేయనుంది. పట్టణ ప్రాంతాల్లో ఎస్ఎంఎస్ ల ద్వారా సమాచారం అందించనుందిద

రెండో డోసు మాత్రమే వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మొదటి జోసు వేస్తే కఠినమైన చర్యలు తీసుకోనున్నారు. రెండో డోసు ఇవ్వడం పూర్తయిన తర్ావతనే తొలి డోసు వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రణాళికను అమలు చేయడానికి రేపు మంగళవారంనాడు కూడా రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ను నిలిపిపేయనున్నారు. 

వ్యాక్సినేషన్ కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రెండో డోసు మాత్రమే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి  ఈ నెల 15వ తేదీ తర్వాతనే వ్యాక్సిన్ డోసులు రానున్నాయి. 

click me!