పెళ్లికి నిరాకరించిందని యువతి కిడ్నాప్.. మద్యం బాటిల్‌తో విచక్షణరహితంగా దాడి..

Published : Jul 22, 2023, 04:04 PM IST
పెళ్లికి నిరాకరించిందని యువతి కిడ్నాప్.. మద్యం బాటిల్‌తో విచక్షణరహితంగా దాడి..

సారాంశం

ప్రకాశం జిల్లా కురిచేడులో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పెళ్లి నిరాకరించిందనే కోపంతో యువతిని కిడ్నాప్ చేసి.. చిత్రహింసలకు గురిచేశాడు. మద్యం సీసాతో విచక్షణరహితంగా దాడి చేసి.. ముఖంపై కూడా గాయపరిచాడు.

ప్రకాశం జిల్లా కురిచేడులో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పెళ్లి నిరాకరించిందనే కోపంతో యువతిని కిడ్నాప్ చేసి.. చిత్రహింసలకు గురిచేశాడు. మద్యం సీసాతో విచక్షణరహితంగా దాడి చేసి.. ముఖంపై కూడా గాయపరిచాడు. దీంతో యువతిని ఆస్పత్రికి తరలించిన  చికిత్స అందించారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా  వెలుగులోకి వచ్చింది. వివరాలు.. బాధిత యువతికి తన గ్రామానికే చెందిన వీరనారాయణా చారితో పరిచయం ఉంది. ఆమె ప్రస్తుతం స్నేహితురాలితో కలిసి కురిచేడులో నివాసం ఉంటుంది. 

అయితే కొంతకాలంగా వీరనారాయణ చారి.. బాధిత యువతిని వేధింపులకు గురిచేస్తున్నాడు. ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని వెంటపడుతూనే ఉన్నాడు. ఈ విషయాన్ని యువతి తన కుటుంబ సభ్యులు చెప్పడంతో.. వారు వీరనారాయణ చారిని అమ్మాయి జోలికి రావొద్దని హెచ్చరించారు. దీంతో కక్ష పెంచుకున్న వీరనారాయణ చారి ఆమెను కిడ్నాప్ చేశాడు. ఓ చోట బంధించి తనను పెళ్లి చేసుకోవాలని ఓత్తిడి తెచ్చాడు. అయితే అందుకు యువతి అంగీకరించకపోవడంతో ఆమెపై దాడి చేశారు. 

ఖాళీ మద్యం బాటిల్‌‌ను పగలగొట్టి యువతి శరీరంపై గాయాలు చేశాడు. గొంతు, ముఖం, చేతుల మీద గాయపరిచాడు. అనంతరం ఆమెను కురిచేడులో వదిలిపెట్టి పారిపోయాడు. అయితే బాధిత యువతి ఈ విషయం కుటుంబ సభ్యులు ఫోన్ ద్వారా సమాచారమిచ్చింది. దీంతో వారు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడి  కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu