ప్రియురాలిని గొంతు నులిమి చంపిన ప్రియుడు.. సంసారం పాడవుతుంది.. రావద్దన్నందుకు దారుణం...

Published : Mar 01, 2022, 11:07 AM IST
ప్రియురాలిని గొంతు నులిమి చంపిన ప్రియుడు.. సంసారం పాడవుతుంది.. రావద్దన్నందుకు దారుణం...

సారాంశం

వివాహేతర సంబంధం గురించి ఇంట్లో తెలిస్తే సంసారం పాడవుతుంది. ఇంటికి రావద్దు అన్నందుకు ఓ వ్యక్తి ప్రియురాలిని గొంతు నులిమి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఆంధప్రదేశ్ లోని కడప జిల్లాలో జరిగింది.

కడప : చెన్నూరు మండలం కొండ పేట గ్రామం వనంవీధిలో నివసించే కె. జ్యోతి(26) అనుమానాస్పద మృతి కేసులో Mystery వీడింది. వివాహేతర సంబంధం వద్దన్నందుకు ఆమెను దారుణంగా murder చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేశారు. ఆదివారం Kadapaలో డిఎస్పి వెంకటశివారెడ్డి విలేకరులకు వివరాలు వెల్లడించారు. చెన్నూరు మండలం కొండపేట గ్రామం వనంవీధిలో నివాసముంటున్న రంగనాయకులు భార్య కె.జ్యోతి ఇటీవల Suspicious statusలో మృతి చెందింది.  

ఆమె మరణంపై అనుమానం ఉందని అనంతపురం రాజమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా, హత్యకేసుగా మార్చిన పోలీసులు కడప అర్భన్ సీఐ ఎస్ఎం ఆలీ ఆధ్వర్యంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ బృందం వివిధ కోణాలలో విచారించి అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రామిరెడ్డి కాలనీకి చెందిన హమాలి బోయ నాగరాజుని నిందితుడిగా గుర్తించింది.  

తన కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలుసుకున్న నిందితుడు ఈనెల 26న కొండపేట విఆర్ఓ సుధీర్కుమార్ వద్ద లొంగిపోయాడు సమాచారం తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. జ్యోతి తన అత్తగారి ఊరైన బుక్కరాయసముద్రం మండలం వాడియంపేటకు వెళ్లి వచ్చే క్రమంలో నాగరాజుతో పరిచయమైంది. అది కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. దీంతో అతను తరచూ కొండపేటలోని జ్యోతి ఇంటికి వచ్చేవాడు.

ఈ క్రమంలోనే ఈ నెల 17న మృతురాలి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో తమ మధ్య ఉన్న వివాహేతర సంబంధం గురించి గ్రామంలో తెలిస్తే తన సంసారం పాడవుతుందని, ఇకపై తన వద్దకు రావద్దని ఆమె చెప్పింది. ఇందుకు అంగీకరించని నాగరాజు ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఇంట్లో నుంచి డబ్బులు, బంగారు ఆభరణాలు దొంగిలించుకుని వెళ్ళాడు. నిందితుడి నుంచి పోలీసులు జత కమ్మలు, బంగారు పుస్తే,  ఎనిమిది వందల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేయడంలో కృషి చేసిన సీఐ, ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డితో పాటు, ఏఎస్ఐ ఎం. జాకీర్ హుస్సేన్, హెడ్ కానిస్టేబుల్ ఐ. జగన్ నాయక్, కానిస్టేబుళ్లు కె. బాషా, కె. నాగరాజు, జి.రాజీవ్ కుమార్, డి.వి. భార్గవ్ లను ఎస్పీ, డీఎస్పీలు అభినందించారు.

ఇదిలా ఉండగా, అనకాపల్లిలో విషాదం  చోటు చేసుకుంది. 

భార్యభర్త, ఇద్దరూ ముద్దులొలికే చిన్నారులు అన్యోన్యంగా సాగిపోతున్న ఆ కుటుంబంలో పెనువిషాదం చోటుచేసుకుంది. ఇద్దరు కుమార్తెలను murder చేసి, వివాహిత suicide చేసుకున్న ఉదంతం విశాఖ జిల్లా  anakapalleలో కలకలం రేపింది. దీనికి సంబంధించి డిఎస్ పి సునీల్,  పట్టణ సీఐ భాస్కర్ రావు, మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం మెట్టపేట గ్రామానికి చెందిన జనార్దనరావు తన అక్క కూతురు అనూషతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. జనార్ధన రావు అర్జ అచ్యుతాపురంలోని Pharma Companyలో పని చేస్తున్నాడు. 

అనకాపల్లి రోడ్డు లోని ఒక ఇంట్లో ఏడు నెలలుగా అద్దెకు ఉంటున్నాడు వీరికి సుదీక్ష (5), గీతాన్విక (1.5 సంవత్సరాలు) కుమార్తెలు. ఉద్యోగానికి సెలవు పెట్టి శనివారం స్వగ్రామం మెట్ట పేట వెళ్ళాడు. సోమవారం సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఫ్యాన్ కి భార్య అనూష ఉరేసుకుని ఉంది. కుమార్తెలు ఇద్దరు కింద పడి ఉన్నారు. వెంటనే 100కీ సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుమార్తెలు ఇద్దర్నీ చున్నీతో ఉరివేసి.. వారు చనిపోయాక అనూష ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు