ఒంగోలులో అగ్ని ప్రమాదం: 9 ప్రైవేట్ బస్సులు దగ్ధం

Published : Mar 01, 2022, 10:30 AM ISTUpdated : Mar 01, 2022, 11:28 AM IST
ఒంగోలులో అగ్ని ప్రమాదం: 9 ప్రైవేట్ బస్సులు దగ్ధం

సారాంశం

ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రైవేట్ పార్కింగ్ ఏరియాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.ఈ ప్రమాదంలో తొమ్మిది బస్సులు దగ్దమయ్యాయి.

 ఒంగోలు:ప్రకాశం జిల్లా Ongoleలో మంగళవారం నాడు ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఉడ్ కాంప్లెక్స్ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్  Parking లో Fire Accident చోటు చేసుకొంది. పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసిన 9 Busలు మంటలకు దగ్దమయ్యాయి.  ఈ పార్కింగ్  స్థలంలో 20 ప్రైవేట్ బస్సులు పార్క్ చేసి ఉన్నాయి.

పార్కింగ్ చేసిన స్థలంలో నిలిపి ఉన్న బస్సులకు మంటలు వ్యాపించడంతో పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు ఫైరింజన్ కు సమాచారం ఇచ్చారు.  ఫైర్ ఫైటర్లు  మంటలను ఆర్పుతున్నారు.  అయితే పార్కింగ్ స్థలంలో అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 

వాహనాలు పక్క పక్కనే నిలిచిఉన్నాయి. వాహనాల్లో డీజీల్ పూర్తి స్థాయిలో ఉండడం కూడా మంటలు త్వరగా వ్యాప్తి చెందడానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి..  ఆరు ఫైరింజన్ల సహాయంతో మంటలను ఆర్పారు. రెండు గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే  పార్కింగ్ స్థలంలో గడ్డి, పిచ్చి మొక్కలను  తొలగించని కారణంగా మంటలు త్వరగా వ్యాప్తి చెందడానికి ఓ కారణంగా అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు