వివాహేతర సంబంధం : భర్త అవమాన పడుతున్నాడని.. ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య..

Published : Oct 28, 2022, 02:04 PM IST
వివాహేతర సంబంధం : భర్త అవమాన పడుతున్నాడని.. ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య..

సారాంశం

పదేళ్లుగా వివాహేతర సంబంధంలో ఉన్న ఓ మహిళ.. దీంతో తన భర్త అవమానాలు పడాల్సి వస్తుందని భర్తతో కలిసి ప్రియుడిని హతమార్చింది.

శ్రీకాకుళం జిల్లా : వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పదేళ్లుగా కొనసాగుతున్న వివాహేతర సంబంధం వదులుకోవాలని చూసినా వినిపించుకోకపోవడంతో పాటు.. పదిమందిలో తన భర్త అవమానాలకు గురికావడంతో భార్యభర్తలు పన్నిన పథకంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. సంతకవిటి మండలం మద్దూరుశంరపేట గ్రామంలో హత్యకు గురైన అల్లబోయిన గోవిందరావు హత్య కేసు మిస్టరీని 24గంటల్లో పోలీసులు ఛేధించారు.

దీనికి సంబంధించి సీఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎంఆర్ అగ్రహారానికి చెందిన గోవిందరావు, శంకరపేట గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించేవాడు. ఈ విషయం తెలిసిన ఆమె భర్త పలుమార్లు పెద్దల వద్ద పంచాయతీ పెట్టినప్పటికీ గోవిందరావు వినిపించుకోలేదు. విశాఖపట్నంలో పనిచేస్తూ గ్రామానికి వచ్చిన ప్రతిసారి ఆమెను ఇబ్బందులకు గురి చేసేవాడు. ఇదిలా ఉండగా గోవిందరావు ఎప్పటికప్పుడు ఆమె భర్తను అవహేళన చేస్తూ అవమానకరంగా ప్రవర్తించేవాడు.

శ్రీకాకుళంలో విషాదం.. తండ్రికి కర్మకాండలు చేపట్టేందుకు వచ్చి.. నదిలో మునిగి టెక్కీ మృతి

దీనిని భరించలేకపోయిన భార్యభర్తలు గోవిందరావును హతమార్చేందుకు పథకం పన్నారు. ఈ మేరకు ఐదు రోజుల క్రితం గ్రామానికి వచ్చిన గోవిందరావును హత్య చేసేందుకు జంతువుల వేటకు ఉపయోగించే విధంగా జీఐ వైరుకు విద్యుత్ షాక్ వచ్చేలా ఏర్పాటు చేశారు. తమ ఇంటికి వస్తున్న దారితో జీఐ వైరుకట్టి దానికి విద్యుత్ సరఫరా అయ్యేలా చేశారు. ఇలా ప్రతిరోజూ రాత్రి ఏర్పాటు చేసి ఉదయం తీసేసేవారు. 

చివరికి ఈ నెల 25న రాత్రి శంకరరావు తన భార్యతో ఫోన్ చేయించి గోవిందరావును ఇంటికి రప్పించాడు. ఇంటికి వచ్చిన గోవిందరావు జీఐ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయమై అందిన సమాచారం మేరకు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేసి నిందితులుగా భార్యభర్తలను నిర్థారించి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని సీఐ వెల్లడించారు. సమావేశంలో ఆయనతోపాటు సంతకవిటి ఎస్సై ఆర్.జనార్దనరావు, లోకేశ్వరరావు, సిబ్బంది ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : ఆగస్ట్ ముగిసినా ఆగని సెలవులు.. సెప్టెంబర్ లో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే వరుస సెలవులు, లాంగ్ వీకెండ్స్ ఇవే
🤣😂 YS Jagan గులకరాయి డ్రామా | Nara Lokesh Hilarious Speech On YS Jagan | Asianet News Telugu