కానిస్టేబుళ్లను స్టేషన్లో నగ్నంగా కూర్చోబెట్టిన..ఎస్పీ.. ఎందుకంటే..

Published : Oct 28, 2022, 08:01 AM IST
కానిస్టేబుళ్లను స్టేషన్లో నగ్నంగా కూర్చోబెట్టిన..ఎస్పీ.. ఎందుకంటే..

సారాంశం

క్రిమినల్స్ లా నలుగురు కానిస్టేబుళ్ళను పోలీస్ స్టేషన్లో నగ్నంగా కూర్చోబెట్టిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరంలో వెలుగులోకి వచ్చింది. దీనికి కారణమేంటంటే...

బళ్లారి : చోరీకేసులు, ఇతర క్రిమినల్ కేసు నిందితులను పోలీసులు దుస్తులు విప్పించి స్టేషన్లో కూర్చోబెట్టడానికి తరచూ చూస్తుంటాం.  కానీ పోలీసుల దుస్తులు ఊడదీసి.. స్టేషన్ లో కూర్చోబెట్టాడు ఓ పోలీసు ఉన్నతాధికారి. ఆయనే విజయనగరం జిల్లా ఎస్పీ అరుణ్.  విజయనగర కాలనీలో వెంకటేష్ మరికొందరు బుధవారం రాత్రి  పేకాట ఆడుతున్నారు. విషయం తెలిసిన మహేష్, అభిషేక్,  మంజునాథ్, శ్రీకాంత్ అనే నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లు పేకాట శిబిరంపై దాడి చేశారు. రూ.20వేల నగదు, ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కానీ, కేసు నమోదు చేయలేదు. స్వాధీనం చేసుకున్న నగదు, సెల్ ఫోన్ ను స్టేషన్లో అప్పగించలేదు.

ఈ క్రమంలో గురువారం ఉదయం పోలీస్ స్టేషన్కు వెళ్లిన పేకాటరాయుడు వెంకటేష్, తన సెల్ఫోన్ ఇవ్వాలని పోలీసులను అడిగాడు. రికార్డులను పరిశీలించిన పోలీసులు, అలాంటి కేసేదీ  నమోదు కాలేదని తెలిపారు. దీంతో వెంకటేష్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఈ విషయం ఎస్పీ వరకూ వెళ్ళింది. దీంతో ఆయన విచారణకు ఆదేశించారు. పేకాట శిబిరంపై జరిగిన దాడి,  నగదు, సెల్ ఫోన్ కాజేసినట్లు తేలడంతో జూదరుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. నలుగురు కానిస్టేబుళ్లపైన ఎస్పీ కేసు నమోదు చేయించారు. ఎస్పీ, కానిస్టేబుళ్ల దుస్తులను విప్పించి రెండుగంటలపాటు స్టేషన్లో కూర్చోబెట్టారు. వారిని సస్పెండ్ చేసి రిమాండ్కు తరలించారు.

పాదయాత్రపై అమరావతి రైతుల పిటిషన్.. విచారణ ముగిసే వరకు హైకోర్టులోనే మంత్రి అమర్‌నాథ్

PREV
click me!

Recommended Stories

School Holidays : ఆగస్ట్ ముగిసినా ఆగని సెలవులు.. సెప్టెంబర్ లో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే వరుస సెలవులు, లాంగ్ వీకెండ్స్ ఇవే
🤣😂 YS Jagan గులకరాయి డ్రామా | Nara Lokesh Hilarious Speech On YS Jagan | Asianet News Telugu