‘నీ భార్య నడవడిక సరిగా లేదు...’ అన్నందుకు వియ్యంకుడిని కత్తితో పొడిచి హత్య..

By AN TeluguFirst Published Sep 29, 2021, 12:57 PM IST
Highlights

ఈనెల 27న ( సోమవారం) ఇబ్రహీంను  విడిగా కలిసిన జగన్నాథ్  కాసేపు మాట్లాడుకున్నారు.  ఈ సమయంలో జగన్నాథ్.. ఇబ్రహీం భార్య నజీమా బేగం నడవడిక సరిగా లేదని విమర్శించారు. తన భార్య గురించి చెడుగా మాట్లాడడం తో  ఇబ్రహీం కోపోద్రిక్తుడయ్యాడు.

అనంతపురం : తన భార్య గురించి చెడుగా మాట్లాడిన వియ్యంకుడిని హతమార్చిన(Murder) ఘటన అనంతపురం(Anantapur) నగరంలో సంచలనం రేకెత్తించింది. వన్టౌన్ సిఐ ప్రతాపరెడ్డి తెలిపిన వివరాల మేరకు..  నగరంలోని ఐదో రోడ్డుకు చెందిన గోగుల జగన్నాథ్ (63), రెవెన్యూ శాఖలో డ్రైవర్ గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందారు.  ఇతనికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు  రామ్మోహన్ .. నగరంలోని రాణి నగర్ కు చెందిన ఎలక్ట్రీషియన్ ఇబ్రహీం ఖలీల్,  నజీమా బేగం దంపతుల  ఒక్కగానొక్క కుమార్తె ఖమర్ తాజ్ ను  రెండేళ్ళ క్రితం ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు.

ప్రేమ, పెళ్లి విషయంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా రెండు కుటుంబాలు సంతోషంగా జీవిస్తూ వచ్చాయి.  5 నెలల క్రితం కోవిడ్‌ బారిన పడి జగన్నాథ్ భార్య మృతి చెందింది.  ఇటీవల రెండో కుమారుడు  శివకృష్ణకు  కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో అందరూ కలిసి  రాణినగర్ లోని వియ్యంకుడు  ఇబ్రహీం ఖలీల్ ఇంటికి చేరుకున్నారు.

పవన్‌పై వ్యక్తిగత విమర్శలెందుకు, మూర్ఖులే అలా మాట్లాడుతున్నారు: వైసీపీపై నాదెండ్ల ఫైర్

ఈనెల 27న ( సోమవారం) ఇబ్రహీంను  విడిగా కలిసిన జగన్నాథ్  కాసేపు మాట్లాడుకున్నారు.  ఈ సమయంలో జగన్నాథ్.. ఇబ్రహీం భార్య నజీమా బేగం నడవడిక సరిగా లేదని విమర్శించారు. తన భార్య గురించి చెడుగా మాట్లాడడం తో  ఇబ్రహీం కోపోద్రిక్తుడయ్యాడు.  అదే రోజు రాత్రి వియ్యంకులు ఇద్దరూ ఒకే గదిలో నిద్రించారు. మంగళవారం వేకువజామున నిద్రలో ఉన్న జగన్నాథ్ పై ఇబ్రహీం కత్తితో దాడి చేశాడు. ఛాతి, కడుపుపై విచక్షణరహితంగా పొడవడంతో  జగన్నాథ్ అక్కడికక్కడే మృతి చెందాడు. 

అనంతరం ఇబ్రహీం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఉదయం నిద్ర లేచిన కుటుంబసభ్యులు చూసే సరికి జగన్నాథ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు.  వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలాన్ని  వీర రాఘవ రెడ్డి,  వన్టౌన్ సిఐ ప్రతాపరెడ్డి పరిశీలించారు.  బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 
 

click me!