బద్వేల్‌లో పోటీపై పవన్‌తో చర్చిస్తాం: బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు

By narsimha lodeFirst Published Sep 29, 2021, 12:06 PM IST
Highlights

బద్వేల్ అసెంబ్లీ స్థానంలో పోటీ చేసే విషయమై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో చర్చించనున్నట్టుగా బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు ప్రకటించారు. బుధవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు.

అమరావతి: కడప జిల్లా బద్వేల్  (Badvel bypoll)అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీపై జనసేనతో (jana sena)చర్చించి నిర్ణయాన్ని ప్రకటిస్తామని బీజేపీ (bjp) ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) ప్రకటించారు.బుధవారం నాడు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.

బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికలపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో త్వరలోనే సమావేశం కానున్నట్టుగా సోము వీర్రాజు ప్రకటించారు.  రెండు పార్టీల మధ్య చర్చల తర్వాత ఈ స్థానం నుండి ఎవరూ పోటీ చేసే విషయాన్ని ప్రకటించనున్నట్టుగా  సోము వీర్రాజు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని సోము వీర్రాజు విమర్శించారు. రెండేళ్లుగా రోడ్ల అభివృద్ది కోసం ప్రభుత్వం నిధులు ఖర్చు చేయలేదని ఆయన విమర్శించారు.రోడ్ల బాగు కోసం జనసేనతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం  చేస్తామని ఆయన ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  బద్వేల్ అసెంబ్లీ స్థానానికి అక్టోబర్ 30వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనే దానిపై  బీజేపీ , జనసేన  నేతలు త్వరలోనే చర్చించుకొని అభ్యర్ధిని ప్రకటించనున్నారు.

click me!