జగన్ పై కత్తి దాడి: కీలక అంశాలు వెల్లడించిన లడ్డా

By Nagaraju TFirst Published Jan 2, 2019, 3:02 PM IST
Highlights

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై కత్తితో దాడి ఘటనకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు విశాఖపట్నం సీపీ మహేష్ చంద్ర లడ్హా.  వైఎస్ జగన్ పై కోడికత్తితో దాడి పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని స్పష్టం చేశారు సీపీ. దాడి కేసులో ఇప్పటి వరకు 92 మందిని విచారించినట్లు స్పష్టం చేశారు.

విశాఖపట్నం: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై కత్తితో దాడి ఘటనకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు విశాఖపట్నం సీపీ మహేష్ చంద్ర లడ్హా.  వైఎస్ జగన్ పై కోడికత్తితో దాడి పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని స్పష్టం చేశారు సీపీ. దాడి కేసులో ఇప్పటి వరకు 92 మందిని విచారించినట్లు స్పష్టం చేశారు. 

వైఎస్ జగన్ పై దాడికి శ్రీనివాసరావు ముందు నుంచే ప్రయత్నాలు చేశాడని తమ విచారణలో తేలినట్లు చెప్పారు. 2018 అక్టోబర్ 18న జగన్ పై దాడి చేసేందుకు ప్రయత్నించాడని చెప్పారు. అయితే వైఎస్ జగన్ 17నే విశాఖట్నం నుంచి వెళ్లిపోవడవంతో ఆ రోజు శ్రీనివాసరావు ప్లాన్ బెడిసికొట్టిందన్నారు. ఆ తర్వాత అక్టోబర్ 25న ప్లాన్ చేసినట్లు మహేష్ చంద్ర లడ్హా తెలిపారు. 

పక్కా ప్లాన్ ప్రకారం వైఎస్ జగన్ పై దాడికి పాల్పడినట్లు తెలిపారు. జగన్ పై దాడి చేసే రోజు  శ్రీనివాసరావు తన ఇంటి నుంచి ఉదయం 4.55 గంటలకు బయలు దేరాడని తెలిపారు. వస్తూ వస్తూ తనను ఈ రోజు టీవీలో చూస్తారంటూ అమ్మాజీ అనే మహిళకు చెప్పినట్లు తెలిపారు. కోడి కత్తిని ఇంటి దగ్గర సానబెట్టాడని అది స్థానికులు కూడా చూసినట్లు చెప్పారు. 

ఉదయం తొమ్మిదిగంటలకు ఎయిర్ పోర్ట్ లో కోడికత్తికి మళ్లీ సానబెట్టినట్లు తెలిపారు. ఆతర్వాత హేమలత, శ్రీనివాస్ ఇద్దరూ ఎయిర్ పోర్ట్ లోకి వెళ్లారని స్పష్టం చేశారు. రెండు సార్లు కోడికత్తిని వేడి నీటిలో స్టెరిలైజ్ చేసినట్లు విచారణలో తేలిందని తెలిపారు. 

వైసీపీ నేత ధర్మశ్రీతో జగన్ మాట్లాడుతుండగా దాడికి పాల్పడినట్లు తెలిపారు. వైఎస్ జగన్ పై తాను కత్తితో దాడి చేస్తానని అమ్మాజీ అనే మహిళకు రెండు సార్లు చెప్పాడని తమ విచారణలో తేలినట్లు స్పష్టం చేశారు. శ్రీనివాస్ దగ్గర నుంచి తాము రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు పురోగతి సాధిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 

మరోవైపు కేసును ఎన్ఐఏ విచారించే అవకాశం ఉందంటూ వస్తున్న వార్తలపై సీపీ స్పందించారు. జాతీయ భద్రతా అంశాలు ఉంటేనే ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుందన్నారు. ఈ కేసులో తాము చెప్పేదాకా చార్జిషీట్ దాఖలు చేయోద్దని హైకోర్టు స్పష్టం చేసిందని సీపీ మహేష్ చంద్ర లడ్హా తెలిపారు.  

click me!