వివాహితతో మైనర్ బాలుడి అక్రమ సంబంధం...దారుణ హత్య

Published : Jan 02, 2019, 02:32 PM IST
వివాహితతో మైనర్ బాలుడి అక్రమ సంబంధం...దారుణ  హత్య

సారాంశం

గుంటూరు జిల్లాలో ఘోరం జరిగింది.ఐటిఐ చదువుతున్న ఓ మైనర్ బాలుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. కాలేజికని వెళ్లిన యువకుడు ఓ చెరుకు తోటలో శవంగా తేలాడు. అయితే ఇతడి హత్యకు అక్రమ సంబంధమే కారణమై ఉంటుందని తెలుస్తోంది. 

గుంటూరు జిల్లా చల్లపల్లి మండలం వక్కవగడ్డ గ్రామానికి చెందిన ఆలూరి గంగాదుర్గారావు(17) ఐటీఐ చదువుతున్నాడు. ఇతడికి సొంత గ్రామానికి చెందిన వివాహితతో అక్రమ సంబంధం ఏర్పడింది. అయితే ఇదే మహిళ మరో వ్యక్తితో కూడా వివాహేతర సంబంధాన్ని కల్గివుంది. ఈ క్రమంలో వివాహిత కోసం దుర్గారావుకు సదరు వ్యక్తిగా గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. 

సోమవారం కాలేజికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి దుర్గారావు ఘంటసాలకు వెళ్లాడు. ఇలా వెళ్ళిన అతడు రాత్రయినా ఇంటికి తిరిగిరాకపోవడంతో ఆందొళన చెందిన తండ్రి దండ్రులు,కుటుంబ సభ్యులు గ్రామంతో పాటు ఘంటసాలతో వెలికారు. అయితే మంగళవారం గ్రామ శివారులోని చెరుకు తోటలో ఓ శవమై పడివున్నట్లు గ్రామస్థులు గుర్తించారు.
దీంతో అక్కడికి చేరుకున్న దుర్గారావు తల్లిదండ్రులు ఆ శవం తమ కొడుకుదేనని గుర్తించారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అందిచ్చిన సమాచారం మేరకు పోలీసులు కూడా ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమై ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu