తెలుగు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నట్లు మహారాష్ట్ర, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ అన్నారు. తెలుగు ప్రజల వల్లే తనకు పేరొచ్చిందని గుర్తు చేసుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె అనంతరం మీడియాతో మాట్లాడారు.
తెలుగు ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నట్లు మహారాష్ట్ర, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ అన్నారు. తెలుగు ప్రజల వల్లే తనకు పేరొచ్చిందని గుర్తు చేసుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె అనంతరం మీడియాతో మాట్లాడారు.
తన ఎన్నిక వ్యవహారంలో బాంబే హైకోర్టు ఆదేశాలమీద సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో శ్రీవారిని దర్శించుకున్నట్లు నవనీత్ కౌర్ చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని రైతులు, మహిళలు, యువతకు సహాయం చేస్తానన్నారు. దేశంలో కరోనా ప్రభావం తగ్గి ప్రజలు సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
undefined
దేశంలోనే అతి చిన్న వయసులో ఎంపీగా విజయం సాధించానని ఈ సందర్భంగా నవనీత్ కౌర్ చెప్పుకొచ్చారు. శుక్రవారం తిరుమలకు వచ్చిన ఆమె శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు.
ఓటమి అక్కసుతోనే శివసేన అభ్యర్థి తనమీద అక్రమ కేసు పెట్టారని మండిపడ్డారు. హైకోర్టులో తనకు చుక్కెదురైనా, సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందన్నారు. తన పోరాటం శివసేనపైనేనని, తన ప్రధాన ప్రత్యర్థి శివసేననే అన్నారు.
తెలుగు ప్రజలకు సేవ చేసేందుకు తనవంతుగా ప్రయత్నిస్తున్నానన్నారు. ప్రధానంగా ఏపీ రైతుల తరఫున లోక్ సభలో తన గలం వినిపిస్తానని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రజల తరువాత, తెలుగు ప్రజల సమస్యల పరిష్కారం మీదే దృష్టి పెడతానని ఎంపీ నవనీత్ కౌర్ స్పష్టం చేశారు.
నవనీర్ కౌర్ తో పాటు పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనసమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ సుబ్రమణియన్, ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాస్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, సినీ నటుడు రాజేంద్రప్రసాద్, తేదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ స్వామివారిని దర్శించుకున్నారు.