సూట్ కేసులో శవం : తీరు మార్చుకోమన్నందుకు.. చంపేశాడు...!!

Published : Jun 30, 2021, 11:18 AM IST
సూట్ కేసులో శవం : తీరు మార్చుకోమన్నందుకు.. చంపేశాడు...!!

సారాంశం

‘నీ తీరు మార్చుకుంటే సరే.. లేకపోతే నువ్వు మాకు అవసరం లేదు. నేను, పాప నా జీతంతో సంతోషంగా బతుకుతాం’ అని భార్య చెప్పడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. 

‘నీ తీరు మార్చుకుంటే సరే.. లేకపోతే నువ్వు మాకు అవసరం లేదు. నేను, పాప నా జీతంతో సంతోషంగా బతుకుతాం’ అని భార్య చెప్పడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. నిద్రిస్తున్న సమయంలో దిండుతో అదిమి చంపేశాడు. తిరుపతి రుయా ఆసుపత్రి ప్రాంగణంలో జూన్ నెల 23వ తేదీ వెలుగులోకి వచ్చిన ‘సూట్ కేసులో కాలిన మృతదేహం’ కేసులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీకాంత్ రెడ్డిని నెల్లూరు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.  కడప జిల్లా బద్వేలుకు చెందిన శ్రీకాంత్ రెడ్డి చిత్తూరు జిల్లా రామసముద్రానికి చెందిన భువనేశ్వరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.  శ్రీకాంత్ రెడ్డి అవినీతి నిర్మూలన పేరిట ఓ సంస్థను స్థాపించాడు. 

రూ. 90 వేలు జీతం తీసుకునే భార్యను వేధించేవాడు. ఆమె జీతం విలాసాలకు ఖర్చు చేసేవాడు. ఆమె బంధువులు, స్నేహితుల ద్వారా రూ.లక్షల్లో అప్పు తీసుకుని తనను తీర్చాలని ఒత్తిడి చేశాడు.  ఈ క్రమంలో తీరు మార్చుకోవాలని భర్తకు సూచించింది. 

ఇక తన ఆటలు సాగవని భావించిన శ్రీకాంత్ రెడ్డి ఈనెల 22న తెల్లవారుజామున రెండు గంటల సమయంలో నిద్ర పోతున్న భార్య ముఖం మీద దిండు అదిమి హతమార్చాడు. అదే రోజు మధ్యాహ్నం ఓ సూట్ కేసులో మృతదేహాన్ని కుక్కి ట్యాక్సీలో రుయా ఆస్పత్రి ప్రాంగణంలోకి తీసుకెళ్లాడు.

అక్కడ భార్య మృతదేహానికి నిప్పు పెట్టాడు. మరుసటి రోజు కాలిన మనిషి అవశేషాలు వెలుగులోకి రావడంతో కూతుర్ని రామసముద్రం లోని అమ్మమ్మకు అప్పగించి పరారయ్యాడు. చివరకు మృతురాలి అక్క కుమార్తె అనుమానం వ్యక్తం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
 

PREV
click me!

Recommended Stories

Ultra-Modern Bhogapuram Airport: అత్యాధునిక హంగులతో భోగాపురం ఎయిర్ పోర్ట్ చూసారా?| Asianet Telugu
Nara Loeksh Pressmeet: ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ పోర్ట్ అవసరమా అన్నారు : లోకేష్ | Asianet Telugu