వైఎస్ఆర్ పదాన్ని ఇతర పార్టీలు వాడొద్దు ఈసీకి మహబూబ్ పాషా వినతి

Published : Jul 01, 2020, 04:54 PM IST
వైఎస్ఆర్ పదాన్ని ఇతర పార్టీలు వాడొద్దు ఈసీకి మహబూబ్ పాషా వినతి

సారాంశం

వైఎస్ఆర్ అనే పదాన్ని ఇతర పార్టీ పేర్లలో వాడకుండా చూడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.  


న్యూఢిల్లీ: వైఎస్ఆర్ అనే పదాన్ని ఇతర పార్టీ పేర్లలో వాడకుండా చూడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.

వైఎస్ఆర్ అనే పదంతో రిజిష్టర్ అయిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రమేనని ఆయన చెప్పారు. కొన్ని పార్టీలు తమ పేరును ఉపయోగించుకొంటున్నాయని ఆయన పరోక్షంగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ  వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరును వాడుతున్నారని ఆయన ఫిర్యాదు చేశారు.

also read:హెచ్చరికలు, షోకాజ్ నోటీసులు ఓవర్: రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు దిశగా వైసీపీ పావులు..?

వైసీపీ అధికార పత్రాలపై పూర్తి పేరు రాయకుండా వైఎస్ఆర్ అని రాయడంపై ఎన్నికల సంఘం ఎదుట ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ ఎంపీకి ఇచ్చిన షోకాజ్ నోటీసులో కూడ వైఎస్ఆర్ అని రాయడంతో ఆ షోకాజ్ తమ పార్టీది అని కొందరు అనుకొంటున్నారని ఆయన మండిపడ్డారు.

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడ తనకు ఇచ్చిన సోకాజ్ నోటీసుపై సాంకేతిక అంశాలను లేవనెత్తారు. తనకు ఇచ్చిన బీ ఫామ్ కు, షోకాజ్ నోటీసు ఇచ్చిన లెటర్ హెడ్ కు తేడా ఉందన్నారు. ఇదే రకమైన అంశాన్ని మహబూబ్ బాషా ఇవాళ ఈసీ ముందు వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Police Recruitment : 2026 లోనే తెలుగు యువత కల సాకారం.. ఖాకీ డ్రెస్ వేసి, సింహాల టోపీ పెట్టేందుకు సిద్దమా..?
IMD Rain Alert : తీవ్రవాయుగుండం తీరం దాటేది ఇక్కడే.. ఈ రెండ్రోజులూ మూడు తెలుగు జిల్లాల్లో వర్షాలే వర్షాలు