మంత్రివర్గంలో చోటు దక్కని కారణంగా అసంతృప్తితో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వైసీపీ హైకమాండ్ నుండి పిలుపు వచ్చింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో చర్చించనున్నారు.
అమరావతి: మంత్రివర్గంలో చోటు దక్కలేదని అసంతృప్తితో ఉన్న మాచర్ల ఎమ్మెల్యే Pinnelli Ramakrishna Reddy ని బుజ్జగించేందుకు YCP నాయకత్వం రంగంలోకి దిగింది. Macherla నియోజకవర్గం నుండి ఈ దఫా తనకు మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భావించారు. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ దఫా అవకాశం దక్కలేదు. దీంతో మాచర్ల నియోజకవర్గంలోని వైసీపీ ప్రజా ప్రతినిధులు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని ప్రకటించారు. CMO లో సీఎం సెక్రటరీగా పనిచేస్తున్న Dhanjaya Reddy ఆదివారం నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్ చేశారు. అయితే ఈ ఫోన్ కు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సరిగా స్పందించకుండానే ఫోన్ పెట్టారని సమాచారం. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇవాళ తాడేపల్లికి రావాలని వైసీపీ నాయకత్వం సూచించింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మాట్లాడాలని ఏపీ మంత్రి Peddireddy Ramachandra Reddy కి సీఎం జగన్ సూచించారు. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తాడేపల్లికి పిలిపించుకొని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడనున్నారు. ఇవాళ మధ్యాహ్నం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు.
మంత్రివర్గంలో చోటు దక్కని కారణంగా కొందరు వైసీపీ ప్రజా ప్రతినిధులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మాజీ మంత్రి Balineni Srinivasa Reddy ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బుజ్జగించారు. దీంతో సోమవారం నాడు సాయంత్రం బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీఎంతో భేటీ అయ్యారు. ఆ తర్వాత సీఎం ఏ బాధ్యత ఇచ్చినా కూడా సమర్ధవంతంగా చేపడుతానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గాన్ని పునర్వవ్యవస్తీకరించారు.11 మంది పాత మంత్రులకు మరోసారి చోటు కల్పించారు. 14 మంది కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. తొలుత అంబటి రాంబాబు ప్రమాణం చేశారు. చివరకు విడుదల రజ.ని మంత్రిగా ప్రమాణం చేశారు. 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్‌లో చోటు దక్కింది. సామాజిక సమీకరణాల పరంగా చూస్తే బీసీ-10, కాపు-4, రెడ్డి-4, ఎస్సీ-5, ఎస్టీ-1, మైనార్టీ-1కి అవకాశం కల్పించారు.అయితే మంత్రివర్గంలో చోటు దక్కని కొందరు వైసీపీ ప్రజా ప్రతినిధులు అసమ్మతి గళం విన్పిస్తున్నారు. రాజీనామాలు చేస్తామని కూడా ప్రకటించారు.