మాచర్లలో టీడీపీ నేతలపై దాడి: పోలీసుల అదుపులో నిందితులు

Siva Kodati |  
Published : Mar 11, 2020, 07:45 PM ISTUpdated : Mar 11, 2020, 07:55 PM IST
మాచర్లలో టీడీపీ నేతలపై దాడి: పోలీసుల అదుపులో నిందితులు

సారాంశం

గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతల వాహనశ్రేణిపై దాడి చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, లాయర్‌ ప్రయాణిస్తున్న కార్లను పలువురు వైసీపీ కార్యకర్తలు మోటారు బైక్‌లపై వెంబడించి కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. 

గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతల వాహనశ్రేణిపై దాడి చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, లాయర్‌ ప్రయాణిస్తున్న కార్లను పలువురు వైసీపీ కార్యకర్తలు మోటారు బైక్‌లపై వెంబడించి కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు.

ఈ ఘటనలో బొండా, బుద్ధాలకు స్వల్పంగా గాయాలు కాగా.. లాయర్‌ కిశోర్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. దీనిని సుమోటాగా స్వీకరించిన పోలీసులు ఈ దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 

Also Read:ప్రాణాలతో తిరిగొస్తాం అనుకోలేదు.. కారును ఇలా నడిపా : డ్రైవర్ యేసు

గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బొండా ఉమ మహేశ్వరరావు బుద్దా వెంకన్నపై దాడిపై ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబునాయుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలు పలువురు టీడీపీ నేతలు పాదయాత్రగా డీజీపీ కార్యాలయానికి వెళ్లారు.

మాచర్లలో టీడీపీ నేతలు ప్రయాణీస్తున్న కారుపై  వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ దాడి ఘటన గురించి చంద్రబాబునాయుడు బొండా ఉమ మహేశ్వరరావుతో పాటు బుద్దా వెంకన్నలను అడిగి తెలుసుకొన్నారు.  

Also Read:ఏపీలో రివెంజ్ పాలిటిక్స్: అప్పుడు పిన్నెల్లి... ఇప్పుడు బుద్ధా, బోండా

చంద్రబాబునాయుడుతో పాటు సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణలు టీడీపీ కార్యాలయం నుండి డీజీపీ కార్యాలయానికి పాదయాత్రగా బుధవారం నాడు వచ్చారు. మాచర్లలో టీడీపీ నేతలపై జరిగిన దాడి గురించి  డీజీపీకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లారు.

అయితే ఆ సమయంలో డీజీపీ లేరు. వీడియో కాన్పరెన్స్ ఉన్నందున  డీజీపీ కార్యాలయంలో లేరు. పోలీసు ఉన్నతాధికారులు వస్తే  వారికి వినతిపత్రం ఇస్తామని  టీడీపీ నేతలు పోలీసులకు చెప్పారు.డీజీపీ కార్యాలయంలో ఈ తరహ ఆందోళనలు చేయడం నిబంధనలను ఉల్లంఘించడమేనని  పోలీసులు చెబుతున్నారు.  

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan with “Tiger of Martial Arts” Title: టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు| Asianet Telugu
Raghurama krishnam raju: ఘట్టమనేని ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే RRR స్పీచ్| Asianet News Telugu