మాచర్లలో బొండా, బుద్దాలపై దాడి: డీజీపీ కార్యాలయం ముందు బాబు ధర్నా

By narsimha lode  |  First Published Mar 11, 2020, 6:59 PM IST

ఏపీ డీజీపీ కార్యాలయం ముందు బుధవారం నాడు రాత్రి టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణలు బైఠాయించారు.  మాచర్లలో టీడీపీ నేతలపై దాడిని నిరసిస్తూ డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన నేతలు బైఠాయించారు.



అమరావతి: ఏపీ డీజీపీ కార్యాలయం ముందు బుధవారం నాడు రాత్రి టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు, సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణలు బైఠాయించారు.  మాచర్లలో టీడీపీ నేతలపై దాడిని నిరసిస్తూ డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన నేతలు బైఠాయించారు.

Also read:ప్రాణాలతో తిరిగొస్తాం అనుకోలేదు.. కారును ఇలా నడిపా : డ్రైవర్ యేసు

Latest Videos

undefined

గుంటూరు జిల్లా మాచర్లలో టీడీపీ నేతలు బొండా ఉమ మహేశ్వరరావు బుద్దా వెంకన్నపై దాడిపై ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబునాయుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలు పలువురు టీడీపీ నేతలు పాదయాత్రగా డీజీపీ కార్యాలయానికి వెళ్లారు.

మాచర్లలో టీడీపీ నేతలు ప్రయాణీస్తున్న కారుపై  వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ దాడి ఘటన గురించి చంద్రబాబునాయుడు బొండా ఉమ మహేశ్వరరావుతో పాటు బుద్దా వెంకన్నలను అడిగి తెలుసుకొన్నారు.  

చంద్రబాబునాయుడుతో పాటు సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణలు టీడీపీ కార్యాలయం నుండి డీజీపీ కార్యాలయానికి పాదయాత్రగా బుధవారం నాడు వచ్చారు. 

మాచర్లలో టీడీపీ నేతలపై జరిగిన దాడి గురించి  డీజీపీకి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లారు. అయితే ఆ సమయంలో డీజీపీ లేరు. వీడియో కాన్పరెన్స్ ఉన్నందున  డీజీపీ కార్యాలయంలో లేరు. పోలీసు ఉన్నతాధికారులు వస్తే  వారికి వినతిపత్రం ఇస్తామని  టీడీపీ నేతలు పోలీసులకు చెప్పారు.డీజీపీ కార్యాలయంలో ఈ తరహ ఆందోళనలు చేయడం నిబంధనలను ఉల్లంఘించడమేనని  పోలీసులు చెబుతున్నారు.   

click me!