అమరావతి మీద అమెరికన్ కంపెనీ ఆసక్తి...

Published : May 06, 2017, 04:10 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
అమరావతి మీద అమెరికన్ కంపెనీ ఆసక్తి...

సారాంశం

ప్రముఖ ఆర్కిటెక్ట్ కంపెనీ ఎం మోసెర్ అసోసియేట్స్‌ అమరావతి నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. ఆ సంస్థ గ్లోబల్ డైరెక్టర్ రస్సెల్ డ్రింకెర్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి  ఈ విషయం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు  తెచ్చేందుకు ముఖ్యమంత్రి  అమెరికాలో పర్యటిస్తున్నారు. రెండో రోజు వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు జరిపారు. ఇందలో మోసెర్స్ ఒకటి.

ప్రముఖ ఆర్కిటెక్ట్ కంపెనీ ఎం మోసెర్ అసోసియేట్స్‌ అమరావతి నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది.

 

ఆ సంస్థ గ్లోబల్ డైరెక్టర్ రస్సెల్ డ్రింకెర్  ముఖ్యమంత్రి చంద్రదబాబు నాయుడికి  ఈ విషయం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి  అమెరికాలో పర్యటిస్తున్నారు. రెండో రోజూ వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు జరిపారు.

 

 

ప్రపంచవ్యాప్తంగా తాము చేపట్టిన పనులను ఎం మోసెర్ కంపెనీ ప్రతినిధులు ఈ సందర్భంగా వివరించారు. (అన్నట్లు ఖరగ్ పూర్ ఐఐటిని డిజైన్ చేసింది కూడా వీరే.)తాము చేపట్టిన వివిధ ప్రాజెక్టుల విశేషాలను వారు ముఖ్యమంత్రికి తెలిపారని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

 

బిలియన్ డాలర్ ఐటి దిగ్గజం జోహో సీఈఓ శ్రీధర్ వెంబు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆసక్తిగా ఉన్నామని ముఖ్యమంత్రికి చెప్పారు.

ముఖ్యమంత్రిని ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ నియో సీఈవో పద్మశ్రీ వారియర్‌ వున్నారు. సిస్కోతో కలిసి పనిచేసిన పద్మశ్రీ వారియర్‌ది స్వస్థలం విజయవాడ.

గతంలో మోటోరోల ఎనర్జీ సిస్టమ్ గ్రూప్‌లో పనిచేసిన అనుభవం కూడా వారియర్‌కు వుంది.   ముఖ్యమంత్రి గూగుల్ వైస్ ప్రెసిడెంట్ టామ్ మూర్‌ను కలిశారు.

అలాగే సెమి కండక్టర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (IP) ప్రపంచ అగ్రశ్రేణి సప్లయర్ గా ఉన్న ARM హోల్డింగ్స్ సంస్థ సీఈఓ సైమన్ అంథోనీ సెగర్స్ (SIMON ANTHONY SEGARS)తో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. ఎఆర్‌ఎం హోల్డింగ్స్ ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్ (IOT)పై ప్రస్తుతం దృష్టి నిలిపింది.

 

ప్రభుత్వ పరిపాలనలో, అభివృద్ధి, సంక్షేమ రంగాలలో సాంకేతికతను తమ ప్రభుత్వం ఎలా అందిపుచ్చుకున్నదీ సైమన్‌కు ముఖ్యమంత్రి తెలిపారు.

 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu