తండ్రిని మించిన కొడుకు... ఉపన్యాసాల్లో, హామీల్లో

First Published May 6, 2017, 2:53 AM IST
Highlights

ఐటి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి లోకేశ్ నాయుడు విశాఖ ‘దాదాపు ముఖ్యమంత్రి’  హోదాలో  లో పర్యటించారు. అక్కడ అనకాపల్లి లో బహిరంగ సభలో ప్రసంగించారు.  ఉపన్యాసమీయడంలో ఆయన తండ్రికేమీ తీసిపోడని అనుమానానికి తావు లేకుండా  ఆయన అనకాపల్లి ప్రసంగం వెల్లడించింది. అతి చన్ని వయసులో తాను మంత్రిగా బాధ్యతలు భుజానేసుకోవడానికి కారణం పెద్ద వాళ్ల మాట కాదనలేకే అన్నారు.  

నిన్నఐటి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి లోకేశ్ నాయుడు విశాఖ లో పర్యటించారు. అక్కడ అనకాపల్లి లో బహిరంగ సభలో ప్రసంగించారు.  ఉపన్యాసమీయడంలో ఆయన తండ్రికకేమీ తీసిపోడని అక్కడ ప్రసంగం అనుమానానికి తావు లేకుండా వెల్లడించింది. అతి చన్ని వయసులో తాను మంత్రిగా బాధ్యతలు భుజానేసుకోవడానికి కారణం పెద్ద వాళ్ల మాట కాదనలేకే అన్నారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  రాష్ట్రంలో లేనపుడు ఆయన డిఫ్యాక్టో సిఎం అన్నట్లు ఆయన పర్యటన జరిగింది. గ్రాండ్ రిసెప్షన్లు, సభలు,ప్రారంభోత్సవాలు.... ఇలా ఎన్నో కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం ఆయన ఏమిచేయాలనుకుంటున్నారో చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత గొప్పవాడో చెప్పాడు, తర్వాత తనెంత గొప్పవాడో కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. ఆయన ప్రసంగంలో  వచ్చే రెండేళ్లో తాను చేస్తానని ఇచ్చిన హామీలివి.ప్రతిపక్ష నాయకుడు జగన్ ను లోక్యాష్ అని పిలిస్తే, దీనికి సమాధానంగా జగన్ ని దొంగబ్బాయ్ అని క్యాంపెయిన్ ప్రారంభించారు.

 

ఆయన ప్రసంగం ఇది (ఎబిఎన్ నుంచి ).

 

1. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి ముందు సిమెంట్ రోడ్డు

2. 5 వేల జనాభా ఉన్న ప్రతి గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ

3. వూర్ల మధ్య లింక్ రోడ్లు

4.రెండేళ్లలో లక్ష ఐటి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత

5. అయిదు  లక్షల  ఇంజనీరింగ్ ఉద్యోగాలు

 

click me!