మరీ ఇంత నిర్లక్ష్యమా ?

First Published May 6, 2017, 3:36 AM IST
Highlights

కేంద్రంప్రకటించిన రూ. 5 వేల మద్దతు ధరలో స్పష్టత లేదని మంత్రులే ఓవైపు చెబుతున్నారు. కాబట్టి రాష్ట్రప్రభుత్వ పథకంలోనే మిర్చిని కొనుగోలు చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. అసలు మిర్చి కొనుగోలు చేయకుండా రాష్ట్రప్రభుత్వం ఎందుకు ఇంతకాలం కాలయాపన చేసిందో తెలియాలి.

మంత్రుల్లో నిర్లక్ష్యం ఎంతలా పేరుకుపోయిందో స్పష్టంగా కనిపిస్తోంది. మిర్చి కొనుగోలు, మద్దతు ధరపై గడచిన రెండు వారాలుగా రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్న విషయం అందరికీ తెలిిసిందే. అయితే, ఘనత వహించిన మంత్రులకు మాత్రం కనబడలేదుు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రెండు రోజుల దీక్ష తర్వాత హడావుడిగా కేంద్రం మద్దతు ధరను ప్రకటిచటంతో పాటు 88 వేల క్వింటాళ్ల కొనుగోలుకు ఆదేశాలు జారీ చేసింది.

తర్వాత చంద్రబాబునాయుడు అమెరికా పర్యటనకు వెళ్లిపోయారు. దాంతో మంత్రులు కూడా రిలాక్స్ మూడ్ లోకి వెళ్లిపోయారు.

అయితే కేంద్రం ప్రకటించిన మద్దతు ధరపై, కొనుగోళ్ల పరిణామంపై రైతులు మళ్ళీ ఆందోళన మొదలుపెట్టారు. దాంతో అమెరికాలో ఉన్న సిఎం స్పందించి ఆదేశాలు జారీ చేయాల్సవ వచ్చింది అంటే రాష్ట్రంలో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులు ఏం చేస్తున్నట్లు? మంత్రులు, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడటం లేదా? 

శని, ఆదివారాల్లో గుంటూరు జిల్లాలోని నడికుడి, వినుకొండ కృష్ణా జిల్లాలోని నందిగామ కర్నూలు, ఒంగోలులో మిర్చి కొనుగోలు చేస్తామంటూ మంత్రులు ప్రకటించారు. అసలు సమస్య పరిష్కారం కోసం రైతులు ఆందోళన చేసే వరకూ ప్రభుత్వం ఏం చేస్తోందో అర్ధం కావటం లేదు.

వివిధ మార్కెట్ యార్డుల్లోను, రైతుల వద్ద లక్షల క్వింటాళ్ళ మిర్చి పేరుకుపోయింది. మార్కెట్ యార్డుల్లో మిర్చి కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే వ్యాపారులకు రవాణా ఛార్జీల్లో రాయితీ, అన్ని సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుందని మంత్రులు తీరిగ్గా ఇపుడు ప్రకటించటం గమనార్హం. అంటే సమస్యేదన్నా వస్తే ఆందోళన చేస్తేగానీ ప్రభుత్వం దిగిరాదన్న భావన  జనాల్లో నాటుకుపోయింది.

శెలవుదినాలైనా సరే మిర్చి కొనుగోలు చేస్తామని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి మీడియాలో ప్రకటించారు. కేంద్రంప్రకటించిన రూ. 5 వేల మద్దతు ధరలో స్పష్టత లేదని మంత్రులే ఓవైపు చెబుతున్నారు. కాబట్టి రాష్ట్రప్రభుత్వ పథకంలోనే మిర్చిని కొనుగోలు చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.

అసలు మిర్చి కొనుగోలు చేయకుండా రాష్ట్రప్రభుత్వం ఎందుకు ఇంతకాలం కాలయాపన చేసిందో తెలియాలి. అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు క్వింటాల్ మిర్చికి రూ. 8 వేలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రులకు, ఉన్నతాధిరులకు ఆదేశాలిచ్చిన తర్వాతే మంత్రులు, ఉన్నతాధికారులు స్పందించటం గమనార్హం.

click me!