MLC Ashok Babu: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్

Published : Feb 11, 2022, 12:04 PM IST
MLC Ashok Babu: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్

సారాంశం

MLC Ashok Babu: టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్‌ బాబును ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగ పదోన్నతి విషయంలో విద్యార్హతను తప్పుగా చూపించారని అశోక్‌ బాబుపై ఆరోపణలున్నాయి. అయితే..అశోక్‌బాబుకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఏపీ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం అనుమతించింది. శుక్రవారం మధ్యాహ్నం 2:15 గంటలకు పిటిషన్‌పై విచారణకు హైకోర్టు అనుమతించింది.

MLC Ashok Babu: టీడీపీ ఎమ్మెల్సీ, ఏపీ ఎన్జీవో సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబుకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఏపీ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం అనుమతించింది. శుక్రవారం మధ్యాహ్నం 2:15 గంటలకు పిటిషన్‌పై విచారణకు హైకోర్టు అనుమతించింది. గురువారం రాత్రి ఎమ్మెల్సీ అశోక్‌బాబును సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. పదోన్నతి కోసం నకిలీ విద్యార్హతలను చూపించారన్న ఆరోపణలపై ఆయనను గురువారం రాత్రి పొద్దుపోయాక విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. 

అశోక్‌బాబు వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీవోగా పని చేసి రిటైర్‌ అయ్యారు. అయితే... డిగ్రీ చదవకుండానే చదివినట్లుగా చూపించారని ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయనపై ఆరోపణలు వచ్చాయి.  దీనిపై ఉమ్మడి రాష్ట్రంలోనే శాఖాపరమైన విచారణ జరిగింది.  తాను ఎలాంటి తప్పు చేయలేదని అశోక్‌బాబు అప్పట్లో వివరణ ఇచ్చారు.దీనిపై విజిలెన్స్‌ అధికారులు కూడా విచారణ జరిపి... ఆయనపై అభియోగాలను ఉపసంహరించారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలోనే ఈ కేసు ‘క్లోజ్‌’ అయ్యింది. 

 అశోక్‌బాబు ఏపీ ఎన్జీవో నేతగా, సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో జేఏసీ అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయనకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది.  తాజాగా... పీఆర్సీపై రగడ రగులుతున్న సమయంలోనే అశోక్‌బాబుపై వైసీపీ ప్రభుత్వం మరోమారు పాత ఆరోపణలను బయటికి తీసింది. తమకు అందిన ఫిర్యాదు మేరకు... విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐడీకి లోకాయుక్త సూచించింది. దీంతో సీఐడీ వెంటనే కేసు నమోదు చేయడం జరిగిపోయింది. గురువారం రాత్రి ఆయనను అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే... ప్రభుత్వ వ్యూహంలో భాగంగానే తనపై లోకాయుక్తకు కొత్తగా ఫిర్యాదు చేయించినట్లు అశోక్‌బాబు ఆరోపించారు.

PREV
click me!

Recommended Stories

AP Food Commission Serious: ఈ హాస్టల్ కంటే జైల్ బెటర్.. పిల్లలు ఏడుపే తక్కువ | Asianet News Telugu
బిలాయి నుండివచ్చాం.. ఆంధ్రాకల్చర్ ని ఎంజాయ్ చేశాం:Visakhaలో Bhogi Celebrations | Asianet News Telugu