భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేదు... నాలుగో తరగతి పుస్తకాల్లో దొర్లిన తప్పు..

Published : Feb 11, 2022, 10:03 AM ISTUpdated : Feb 11, 2022, 10:05 AM IST
భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేదు... నాలుగో తరగతి పుస్తకాల్లో దొర్లిన తప్పు..

సారాంశం

రాష్ట్ర రాజధాని మీద స్పష్టత లేకపోవడంతో ఓ పెద్ద తప్పు దొర్లిపోయింది. ఏపీలోని నాలుగో తరగని పాఠ్యపుస్తకాల్లో ముద్రించిన భారతదేశ పటంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు ముద్రించలేదు. దీంతో పాఠాలు చెప్పు సమయంలో ఇబ్బంది అవుతుందంటూ.. టీచర్లు చెబుతున్నారు.

అమరావతి :  Andrapradesh రాష్ట్రానికి రాజధాని లేకుండా నాలుగో తరగతి ‘మన ప్రపంచం’ పాఠ్యపుస్తకంలో ముద్రించారు. సెమిస్టర్-టు తెలుగు మాధ్యమం పాఠ్య పుస్తకం చివర్లో ముద్రించిన india mapలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాటి రాజధాని పేర్లు ఉండగా… ఆంధ్రప్రదేశ్ కు మాత్రం capital city పేరు ఇవ్వలేదు. 

కేవలం ఆంధ్రప్రదేశ్ అని మాత్రమే రాసి వదిలేశారు. దీనిపై ఉపాధ్యాయుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. భారతదేశం పటం చూపిస్తూ విద్యార్థులకు రాష్ట్రాలు, రాజధానుల పేర్లు చెప్పే సమయంలో.. రాష్ట్ర రాజధాని ఏమని చెప్పాలి? అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి 2020- 21కి పాఠ్యపుస్తకాలను రూపొందించింది. ద్విభాషా పుస్తకాలను తీసుకు వచ్చింది. పాఠ్యపుస్తకాల పరిమాణం తక్కువగా ఉండేందుకు మూడు సెమిస్టర్లుగా విభజించి ముద్రించారు. రెండో సెమిస్టర్ పాఠ్యపుస్తకం చివరిలో  భారతదేశం పటాన్ని ఇచ్చారు. 

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 3న ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇప్పుడు అమరావతే అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి Nithyanandarai స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 2015 లోనే దీన్ని ప్రకటించినప్పటికీ, 2020 లో three capitals  lawని తీసుకు వచ్చి తర్వాత ఉపసంహరించుకుంది అని గుర్తు చేశారు.  ఇప్పుడు మాత్రం అమరావతే capitalగా ఏపీ ప్రభుత్వం తెలియజేసిందని బుధవారం రాజ్యసభలో వివరించారు. బిజెపి సభ్యుడు GVL Narasimha Rao మాట్లాడుతూ.. ‘మూడు రాజధానుల  పేరిట ఏపీ ప్రభుత్వం  అయోమయం సృష్టించింది. కేంద్రం కొన్నిసార్లు ఏపీకి సంబంధించిన వర్తమానాలను హైదరాబాద్ చిరునామాకు పంపుతోంది. ఏపీ రాజధానిపై స్పష్టత ఇవ్వాలి. రాజధాని నిర్ణయాధికారం ఎవరిదో చెప్పాలి’  అని ప్రశ్నించారు.

మంత్రి నిత్యానంద రాయ్ బదులిస్తూ ‘రాజధానిపై  నిర్ణయాధికారం  రాష్ట్రానిదే. 2015 ఏప్రిల్ 23న ఏపీ ప్రభుత్వం అమరావతిని తమ రాజధానిగా ప్రకటించింది. 2020 జూలైలో ఒక చట్టం ద్వారా అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా పేర్కొంది. ఆ చట్టాన్ని ఉపసంహరించుకున్నట్లు మాకు మీడియా ద్వారా తెలిసింది. సమీక్ష తర్వాత మూడు రాజధానులా? ఒక రాజధానా? అన్నది తేల్చుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు విన్నాం. ప్రస్తుతం అమరావతే ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది’ అని స్పష్టం చేశారు.

సీఎంలు చర్చించుకుంటే మంచిదే…
‘ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంచి మిత్రులు. విభజన సమస్యలపై వారిద్దరూ మాట్లాడుకుని పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం లేదు. కేంద్రం కార్యదర్శి స్థాయి అధికారులను పిలవడానికి బదులు సీఎంలతోనే ఎందుకు చర్చించడం లేదు’ అని బిజెపిఎంపీ CM Ramesh ప్రశ్నించారు.  కేంద్రమంత్రి బదులిస్తూ ‘విభజన అంశాలను ఏకాభిప్రాయంతో పరిష్కరించుకోవాలని తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో హోంమంత్రి అమిత్ షాసూచించారు. 

ముఖ్యమంత్రులు ఇద్దరూ కలిసి చర్చిస్తే మంచిదే. మేము అదే కోరుకుంటున్నాం. హోం శాఖ తరఫున ప్రయత్నించాం. 24 సమావేశాలు నిర్వహించాం’ అని గుర్తు చేశారు. ఏపీకి తెలంగాణ Electricity arrears చెల్లించడం లేదని, శ్రీశైలం నుంచి అక్రమంగా నీటిని వాడుకుంటోందని, దీనిపై కేంద్రం ఏం చర్యలు తీసుకుంటుందని ఎంపీ టిజి వెంకటేష్ ప్రశ్నించారు. ‘విద్యుత్ బకాయిల చెల్లింపు రెండు రాష్ట్రాల మధ్యా ఉంది. దీనిపై కేంద్రం అవగతం చేసుకుని ఏం చేయాలో చూస్తాం. సమన్వయం చేయగలం తప్ప, నిర్ణయం తీసుకోలేం. మా సూచనలు రాష్ట్రాలకు పంపుతాం. శ్రీశైల నీటి విడుదల వివాదాన్ని జలశక్తి శాఖ  పరిశీలిస్తుంది’ అని వివరించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Raghurama Krishnam Raju: కోడిపందాలను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR | Asianet News Telugu
RK Roja Bhogi Lecebrations With Family: భోగి రోజు రంగురంగు ముగ్గులు వేసిన రోజా| Asianet News Telugu