నంద్యాల జిల్లాలో విషాదం.. 40 రోజుల క్రితం పెళ్లి.. అది ఇష్టం లేక ప్రేయసితో కలిసి ఆత్మహత్య..!

Published : Jun 29, 2022, 01:17 PM IST
నంద్యాల జిల్లాలో విషాదం.. 40 రోజుల క్రితం పెళ్లి.. అది ఇష్టం లేక ప్రేయసితో కలిసి ఆత్మహత్య..!

సారాంశం

నంద్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట రైలు కిందపడి ఆత్మహత్య‌కు చేసుకుంది. జిల్లాలోని క్రిష్ణగిరి మండలం మల్యాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.

నంద్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట రైలు కిందపడి ఆత్మహత్య‌కు చేసుకుంది. జిల్లాలోని క్రిష్ణగిరి మండలం మల్యాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే యువకుడికి ఇదివరకే పెళ్లి జరిగిందని.. అయితే ఇష్టం లేని పెళ్లి చేశారని, ప్రేయసితో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మృతులను అలంకొండకు చెందిన ప్రసాద్, అనితలుగా గుర్తించారు. వివరాలు..  ప్రసాద్, అనిత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రసాద్‌కు కుటుంబ సభ్యులు 40 రోజుల క్రితం అతని అక్క కూతురితో వివాహం జరిపించారు. 

ప్రసాద్ ప్రేమ విషయం తెలిసినప్పటికీ కుటుంబ సభ్యులు ఈ పెళ్లి చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ పెళ్లి ఇష్టం లేని ప్రసాద్.. అనిత కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు  చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

(ఆత్మహత్య అనేది సమస్యకు పరిష్కారం కాదు. మీకు ఎటువంటి కౌన్సిలింగ్ సహాయం కావాలన్నా ఐకాల్ (9152987821), ఆసరా (09820466726) వంటి సంస్థలను సంప్రదించండి)

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?