గత మూడేళ్లుగా ప్రభుత్వం తనపై చేసిన ఆరోపణల్లో ఏ ఒక్క ఆరోపణను కూడా నిరూపించలేకపోయిందని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు. తనపై విధించిన సస్పెన్షన్ చెల్లదని కూడా ఆయన తేల్చి చెప్పారు. ప్రభుత్వ తీరుపై న్యాయపోరాటం చేస్తానన్నారు.
అమరావతి: Chandrababunaidu సీఎంగా ఉన్న కాలంలో రాష్ట్రాన్ని తగులబెట్టేందుకు కొందరు చేసిన ప్రయత్నాలను ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉండి అడ్డుకొన్నందునే తనను కొందరు వ్యక్తులు, శక్తులు లక్ష్యంగా చేసుకొన్నాయని సస్పెన్షన్ కు గురైన సీనీయర్ ఐపీఎస్ అధికారి AB Venkateswara rao, చెప్పారు.
బుధవారం నాడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.. తనపై అవినీతి నిరోధక శాఖ ఆరోపణలన్నీ అవాస్తవమని సస్పెన్షన్ కు గురైన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో తాను ఇంటలిజెన్స్ చీఫ్ గా రాష్ట్రం తగులబడకుండా అడ్డుపడినట్టుగా చెప్పారు.
also read:నిన్న గాక మొన్న విధుల్లోకి.. అంతలోనే, ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు
కోడికత్తి కేసును అడ్డు పెట్టుకుని రాష్ట్రాన్ని తగులబెట్టే ప్రయత్నం చేశారన్నారు. ఈ ప్రయత్నాలను తాను అడ్డుపడినట్టుగా చెప్పారు. దీంతో కొందరు వ్యక్తులు, శక్తులు తనను టార్గెట్ చేశాయని ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. తనపై ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ చెల్లదని ఏబీ వెంకటేశ్వరరావు తేల్చి చెప్పారు. తనపై అనేక ఆరోపణలు చేశారు, కేసులు బనాయించారన్నారు. తనపై బనాయించిన కేసుల్లో, చేసిన ఆరోపణల్లో ఒక్కటీ కూడా నిరూపించలేకపోయారని ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై న్యాయ పోరాటం చేస్తానని కూడా ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు. చెడ్డ పనులు జరగకుండా అడ్డుపడడమే తాను చేసిన తప్పా అని ఆయన ప్రశ్నించారు.
ఓ కేసులో తనను కొందరు బెదరించారని కూడా ఏబీ వెంకటేశ్వరరావు గుర్తు చేసుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధి తనను బెదరించారని ఆయన వివరించారు. నిన్న ఓ మీటింగ్ లో ఆ ప్రజా ప్రతినిధే భోరున ఏడ్చారని కూడా ఏబీ వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా ప్రస్తావించారు. తనపై మరో రెండు విచారణలు పెండింగ్ లో పెట్టారన్నారు.
తనపై విచారణ సమయంలో నకిలీ పత్రాలు పెట్టారని ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు. టీడీపీ హయంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి తాను కీలకపాత్ర పోషించినట్టుగా వచ్చిన ఆరోపణలపై మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలను ఇప్పుడు కూడా వెళ్లి విచారణ చేసుకోవచ్చన్నారు. తాను ఆ ఎమ్మెల్యేలను ప్రభావితం చేసినట్టుగా నిరూపించాలన్నారు. తన తప్పుందని తేలితే తనపై కేసు పెట్టుకోవచ్చని ఆయన సవాల్ విసిరారు.
ఇజ్రాయిల్ కంపెనీ కూడా తాము ఎలాంటి రక్షణ, నిఘా పరికరాలను ఏపీకి విక్రయించలేదని రెండు సార్లు లేఖలు రాసిన విషయాన్ని కూడా ఏబీ వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. ఈ విషయమై తనపై ఏడాదిన్నర క్రితం కేసు బుక్ చేసి ఒక్క ఆధారం కూడా పట్టుకోలేకపోయారని చెప్పారు.తనకు అధికారికంగా ఆర్డర్ కాపీ అందలేదన్నారు. సోషల్ మీడియాలోనే తనపై విధించిన సస్పెన్షన్ కాపీని చూసినట్టుగా ఏబీ వెంకటేఃశ్వరరావు చెప్పారు. ఈ ఆర్డర్ కాపీలో తాను సర్వీస్ రూల్స్ కు విరుధ్దంగా వ్యవహరించడంతో సస్పెండ్ చేసినట్టుగా లేదన్నారు. కానీ రాత్రి నుండి కొన్ని మీడియా సంస్థల్లో తాను సర్వీస్ రూల్స్ కు విరుద్దంగా వ్యవహరించినట్టుగా ప్రచారం చేశారని ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు.
2021 మార్చిలో తనపై కేసు పెట్టినట్టుగా చెబుతున్నారన్నారు.3-1 కింద విధించిన సస్పెన్షన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసిందని ఏబీ వెంకటేశ్వరరావు గుర్తు చేశారు. మళ్లీ 3-3 సెక్షన్ కింద ఎలా సస్పెన్షన్ విధిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇది చట్ట విరుద్దం కాదా అని అడిగారు.తనపై చార్జీషీట్ లేదన్నారు. తానేందుకు భయపడాలో చెప్పాలన్నారు. సీఎం జగన్ పై 11 చార్జీషీట్లున్నాయి, ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మిపై చార్జీషీట్లున్నాయని కూడా ఆయన గుర్తు చేశారు.