‘పనికిమాలిన దానా.. బయటకు పో’...మహిళా ఉద్యోగిని మీద.. ఎస్సీ వెల్ఫేర్ డీడీ దురుసు ప్రవర్తన.. వైరల్..

By SumaBala BukkaFirst Published Jun 29, 2022, 12:40 PM IST
Highlights

అనంతపురంలో ఓ మహిళా ఉద్యోగినిపై పై అధికారి దురుసుగా వ్యవహరించాడు. ఇష్టం వచ్చినట్లు తిడుతూ.. కొట్టడానికి చెయ్యెత్తాడు.

అనంతపురం : మహిళా ఉద్యోగినిమీద ఎస్సీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్ర్ విశ్వమోహన్ రెడ్డి దురుసుగా ప్రవర్తించాడు. శ్రీలక్ష్మి అనే మహిళా వార్డెన్ ను డీడీ విశ్వమోహన్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషించాడు. సాధారణ బదిలీల్లో భాగంగా కదిరిలోని మరో హాస్టల్ కు బదిలీ చేయాలని డీడీని మహిళా వార్డెన్ కోరారు. కాగా వార్డెన్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డీడీ.. ‘పనికిమాలిన దానా.. బయటకు పో’ అంటూ చెయ్యెత్తి కొట్టే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం విశ్వమోహన్ రెడ్డి వార్నింగ్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. డీడీ తీరుపట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. 

కాగా, ఇలాంటి ఘటనే ఈ యేడు జనవరిలో మహారాష్ట్రలో చోటు చేసుకుంది. అధికారమదంతో ఓ అధికారి గర్భిణి అని కూడా చూడకుండా.. మహిళా ఉద్యోగి మీద పైశాచికంగా దాడి చేశాడు. దీనికి అతని భార్య కూడా సహకరించడం దారుణం.  గర్భిణితో ఉన్న అటవీ శాఖ ఉద్యోగిని మీద గ్రామ మాజీ సర్పంచి, అతని భార్య కలిసి దాడి చేశారు. 

నా కోరిక తీరిస్తేనే సంతకం చేస్తా: మహిళా ఉద్యోగినిపై అధికారి లైంగిక వేధింపులు

మహారాష్ట్రలోని సతారా జిల్లా పల్సనాడే గ్రామంలో ఈ దారుణం జరిగింది. నిందితుడు స్థానికంగా అటవీ నిర్వహణ కమిటీలో సభ్యుడు. గతంలో సర్పంచ్ గా కూడా పనిచేశాడు. తన అనుమతి లేకుండా కాంట్రాక్ట్ కార్మికులను వెంట తీసుకు వెళ్లారనే కోపంతో ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ మహిళా గార్డు మీద కోపోద్రిక్తుడయ్యాడు. 

ఆమె గర్భంతో ఉందని కూడా చూడకుండా తన భార్యతో కలిసి దాడి చేశాడు. బూటు కాలుతో కడుపు మీద తన్నాడు. బాధితురాలు ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. ఈ ఘటన మీద మంత్రి ఆదిత్య ఠాక్రే తీవ్రంగా స్పందించారు. ఉద్యోగుల మీద దాడులు సహంచబోమని, బాధితురాలికి జరగకూడనిది జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. 

click me!