ఏపీలో లవ్ జిహాద్... రెండుసార్లు అబార్షన్లు, మూడుసార్లు తలాక్, యువతి ఆవేదన

By Arun Kumar PFirst Published Mar 17, 2021, 3:32 PM IST
Highlights

మూడు సంవత్సరాల క్రితం ఎస్వి యూనివర్శిటీలో చదువుతున్న తనను గుంతకల్ కు చెందిన తాసీఫ్ ప్రేమిస్తున్నానని నమ్మించి పెళ్లి చేసుకుని ఇప్పుడు వదిలించుకున్నాడంటూ బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

గుంటూరు: లవ్ జిహాదీలో భాగంగా తనను ఓ యువకుడు మోసం చేశాడంటూ గుంటూరు అర్బన్ ఎస్పీకి ఓ యువతి ఫిర్యాదు చేసింది. మూడు సంవత్సరాల క్రితం ఎస్వి యూనివర్శిటీలో చదువుతున్న తనను గుంతకల్ కు చెందిన తాసీఫ్ పరిచయం పెంచుకున్నాడని బాధిత యువతి దివ్య తెలిపింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారిందని పేర్కొన్నారు. ఇలా ప్రేమ పేరుతో నమ్మించి పెళ్ళి చేసుకున్న తాసిఫ్ మత మార్పిడి చేయించేందుకు ప్రయత్నించినట్లు తెలిపారు. ఇలా తనను మోసగించిన తాసీఫ్ పై చర్యలు తీసుకోవాలని అర్బన్ ఎస్పీకి దివ్య ఫిర్యాదు చేశారు. 

బాధితురాలు దివ్య మాట్లాడుతూ... తాసీఫ్ తనను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్ళి చేసుకున్నాడని తెలిపారు. హిందువునయిన తనను ఇస్లాంలోకి బలవంతంగా మతం మార్చే ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్తు పదార్దాలను ఇచ్చి చిత్ర హింసలకు గురి చేశాడని... ఇప్పుడు మూడుసార్లు తలాక్ అని చెప్పి వదిలేశాడని ఫిర్యాదులో పేర్కొంది. 

పెళ్లి తర్వాత తనను రెండు సార్లు అబార్షన్ కూడా చేయించాడని దివ్య వెల్లడించింది. లవ్ జిహాద్ పేరుతో తనను తీవ్ర ఇబ్బందులు పెట్టిన తాసీర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని దివ్య ఎస్పీని కోరింది. తనకు న్యాయం జరిగేలా చూడాలని దివ్య డిమాండ్ చేసింది. 
 

click me!