అసైన్డ్ భూముల కుంభకోణం: వివరాలిస్తా.. జగన్‌కు నోటీసులిస్తారా, హర్షకుమార్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Mar 17, 2021, 3:23 PM IST
Highlights

మున్సిపల్ ఎన్నికలు అయిపోయి 24 గంటలు ముగియక ముందే టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు సహా నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పి. నారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. 

మున్సిపల్ ఎన్నికలు అయిపోయి 24 గంటలు ముగియక ముందే టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు సహా నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పి. నారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ నేపథ్యంలో సీనియర్ రాజకీయ వేత్త, మాజీ ఎంపీ  హర్షకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అసైన్డ్ భూముల విషయంలో చంద్రబాబు ఇచ్చిన నోటీసులే ముఖ్యమంత్రి జగన్‌కు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

జగన్ ఇళ్ళ స్థలాల పంపిణీ పేరుతో దళితుల నుంచి అతికిరాతంగా, బలవంతంగా అసైన్డ్ భూములు లాక్కున్నారని హర్షకుమార్ ఆరోపించారు. సీఐడీ అధికారులు అసైన్డ్ భూముల విషయంలో చంద్రబాబుపై పెట్టిన సెక్షన్లు ముఖ్యమంత్రి జగన్‌తో పాటు రాష్ట్ర రెవెన్యూ మంత్రి, ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్‌లపైనా పెట్టి నోటీసులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read:కారణమిదీ: సీఐడీ నోటీసులు, ఏలూరుకి వెళ్తున్న బాబు

జగన్ అసైన్డ్ భూముల లాక్కున్న విషయంపై కావాల్సిన వివరాలు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేస్తానని హర్షకుమార్ చెప్పారు. సీఐడీ అధికారులు జగన్‌పై కేసులు పెట్టకపోతే సీఐడీ అధికారులపై హైకోర్టులో ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.

ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్, రాజశేఖర్‌ రెడ్డిలు దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను సీఎం జగన్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోను బలవంతంగా లాక్కున్నారని హర్షకుమార్ మండిపడ్డారు. చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు దళితులను బలిపశువులు చేసిన ముఖ్యమంత్రి జగన్‌కు జోహార్లు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

click me!