పరువు కోసం తల్లి ప్రేమ కోసం కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను బయట సంబంధాలకు ఇస్తే కాపురం ఉంటుందో అన్న భయంతో సొంత తమ్ముడికి ఇచ్చి వివాహం చేసింది ఆ తల్లి. భార్య గా వచ్చిన మేనకోడలిని ఆమె కోరిక మేరకు డిగ్రీ చదివిస్తున్నాడు భర్త.
పరువు కోసం తల్లి ప్రేమ కోసం కుమార్తె ఆత్మహత్య చేసుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను బయట సంబంధాలకు ఇస్తే కాపురం ఉంటుందో అన్న భయంతో సొంత తమ్ముడికి ఇచ్చి వివాహం చేసింది ఆ తల్లి. భార్య గా వచ్చిన మేనకోడలిని ఆమె కోరిక మేరకు డిగ్రీ చదివిస్తున్నాడు భర్త.
నిత్యం 25 కి.మీ. దూరం తీసుకెళ్లి తీసుకొస్తున్నాడు. ఆమె ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి. భార్య ప్రేమ వ్యవహారం ఆ కుటుంబంలో కలకలం రేపింది. ఈ విషయమై తల్లీకుమార్తెల మధ్య గొడవ జరిగింది. తెల్లవారే సరికి ఇద్దరూ మృతి చెందడంతో పండగ పూట విషాదం నెలకొంది.
undefined
పోలీసుల కథనం మేరకు పెదకూరపాడు మండలంలోని బుస్సాపురం గ్రామానికి చెందిన యువకుడికి గత ఏడాది అతని సోదరి కట్లగుంట నాగవర్థిని (40) కుమార్తె దివ్య సాయిశ్రీ(20)తో వివామమైంది.
అప్పటికే దివ్యసాయిశ్రీ సత్తెనల్లిలో డిగ్నీ రెండో సంవత్సరం చుదువతోంది. దివ్యసాయిశ్రీ భర్త కూడా సత్తెనపల్లిలోనే ఇనుము, సిమెంట్ షాపులో పనిచేస్తున్నాడు. అతను రోజూ భార్యను కాలేజీ వద్ద వదిలి తన విధులకు వెళ్లేవాడు.
సాయంత్రం భార్యతో కలిసి బుస్సాపురం వచ్చేవాడు. ఈ క్రమంలో ఈ నెల పదో తేదీన పరీక్ష ఉండడంతో భార్యను కాలేజీ వద్ద వదిలి వెళ్లాడు. సాయంత్రం కాలేజీ వద్దరకు రాగా భార్య కనిపించలేదు.
ఆమె స్నేహితులను విచారించగా దివ్యసాయిశ్రీ తనతో కలిసి చదువుతున్న వ్యక్తిని ప్రేమిస్తోందని, అతడితో కలిసి వెళ్లిందని చెప్పారు. దివ్యసాయిశ్రీ భర్త పాత గుంటూరులో నివసిస్తున్న తన సోదరి నాగవర్థినికి ఈ విషయం చెప్పాడు.
ఈ క్రమంలో దివ్యసాయిశ్రీని ప్రేమించిన వ్యక్తి కుటుంబ సభ్యులు పెళ్లయిన అమ్మాయితో ప్రేమ ఏంటని మందలించారు. దివ్యసాయిశ్రీ తమ వద్దే ఉందని ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పెదకూరపాడు పోలీసు స్టేషన్ లో పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి ఇరువైపుల వారిని ఇంటికి పంపారు.
కుమార్తె దివ్యసాయిశ్రీని తీసుకుని నాగవర్ణిని సోమవారం తమ్ముడి ఇంటికి వచ్చింది. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి దివ్యసాయిశ్రీ,, నాగవర్థిని ఇంటిపై నిద్రించారు.
ఈ క్రమంలో దివ్యసాయిశ్రీ భర్త తన తల్లి ఇంటికి వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తన బాబాయతో కలిసి తన ఇంటిపైకి వెళ్లే సరికి తన సోదరి, భార్య అచేతనంగా పడి ఉండటం, వారి వద్ద పురుగు మందు వాసన రావడంతో స్థానికుల సహాయంతో పెదకూరపాడు వైద్యశాలకు తరలించగా అప్పటికే తల్లీ కుమార్తెలు మృతి చెందారని వైద్యులు నిర్థారించారు.
పెదకూరపాడు సీఐ గుంజి తిరుమలరావు ఆధ్వర్యంలో ఎస్ఐ పట్టాభిరామ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.