పవన్ కల్యాణ్ మద్దతు కోరిన లండన్ మేయర్ అభ్యర్థి తరుణ్ గులాటీ...

Published : Nov 09, 2023, 10:00 AM IST
పవన్ కల్యాణ్ మద్దతు కోరిన లండన్ మేయర్ అభ్యర్థి తరుణ్ గులాటీ...

సారాంశం

లండన్ లో భారతీయ సంతతికి చెందిన తరుణ్ గులాటీ మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 

హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్ మేయర్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన తరుణ్ గులాటీ పోటీ చేస్తున్నారు. ఆయన తనకు మద్ధతు ఇవ్వమని జనసేన పార్టీ అధ్యక్షుడిని అడిగారు. మేయర్ ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని.. ఈ ప్రాంతంలో జనసేన అభిమానులు ఎక్కువగా ఉన్నారని.. అందుకే పవన్ మద్దతు కోరుతున్నట్లు తెలిపారు. తాను పవన్ ను మద్దతు కోరినట్లు.. ఆయన తన అభ్యర్థనను స్వాగతించినట్లుగా తెలిపారు. 

దీన్ని పవన్ కల్యాణ్ స్వాగతించి, అభినందించినట్లుగా జనసేన పార్టీ కూడా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రకటనలో జనసేన అధికారికంగా లండన్ మేయర్ బరిలో ఉన్న భారత సంతతికి చెందిన తరుణ్ గులాటికి మద్దతు ప్రకటించుతున్నట్లుగా తెలిపింది. లండన్ లోని తెలుగువారు, భారతీయులు, తన అభిమానులు, జనసేన శ్రేణులు  గులాటి విజయానికి కృషి చేయాలని కోరారు. పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా కలిసిన గులాటికి ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

విశాఖలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్ | Pawan Kalyan Visakhapatnam Tour| Asianet News Telugu
పసిఫిక్ మహాసముద్రంలో తుపాను...ఏపీ, తెలంగాణలో వర్షాలు | AP & Telangana Weather | Asianet News Telugu