Tirupati: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మెరుగైన పాలన అందిస్తున్నదనీ, దీంతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి అర్కే రోజా అన్నారు. వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్ని పథకాలను దేశంలో ఎక్కడా చేపట్టలేదని తెలిపారు.
AP Tourism and Culture Minister RK Roja: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతుందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం కింద రైతు లబ్ధిదారులకు రూ.73.95 కోట్ల ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో మొత్తాలను జమ చేశారు. తిరుపతి జిల్లా నగరి నియోజకవర్గం వడమాలపేటలో జిల్లా స్థాయి కార్యక్రమానికి మంత్రి రోజా, తిరుపతి జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి తదితరులు హాజరయ్యారు.
రైతులను ఉద్దేశించి రోజా మాట్లాడుతూ.. రైతులు సంతోషంగా ఉన్నప్పుడే ప్రజలు సంతోషంగా ఉంటారన్నారు. రైతాంగం శ్రమతో ప్రతి ఒక్కరూ ఆహార ధాన్యాలను పొందుతున్నారు. ముఖ్యమంత్రి తన పాదయాత్రలో రైతులకు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చడంతోపాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మెరుగైన పాలన అందిస్తున్నదనీ, దీంతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి అర్కే రోజా అన్నారు. వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్ని పథకాలను దేశంలో ఎక్కడా చేపట్టలేదని తెలిపారు.
రైతు భరోసా కింద రైతులకు రూ.13,500 ఆర్థిక సాయంతో పాటు సున్నా వడ్డీకి పంట రుణాలు, ఉచిత పంటల బీమా, రైతులకు తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్, ఈ-క్రాప్ బుకింగ్‌తో పాటు అనేక ఇతర పథకాలను ముఖ్యమంత్రి అందజేస్తున్నారని ఆమె గుర్తు చేశారు. కౌలు రైతులకు రైతు భరోసా కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే లబ్ధి చేకూరుస్తోందన్నారు. తిరుపతి జిల్లాలోనే 2019-2022 మధ్య 1,76,345 రైతు కుటుంబాలకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా 927 కోట్ల రూపాయల మేర లబ్ది చేకూరిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం లక్ష్యం ప్రతి రైతుకు రూ.13,500 పెట్టుబడి సాయం అందించడమేనన్నారు. సాగు వివిధ దశలలో ప్రతి సంవత్సరం మే, అక్టోబరు, జనవరిలో మూడు విడతలుగా ఈ పథకం కింద సహాయం అందించబడుతోందని తెలిపారు.