ఆంధ్ర‌ప్ర‌దేశ్ కే పెట్రోలియం యూనిర్శిటీ

First Published Jul 19, 2017, 1:56 PM IST
Highlights
  • పెట్రోలియం యూనివ‌ర్శిటీ  ఆంధ్రకు గ్రీన్ సిగ్నల్.
  • లోక్ సభ అమోదం

గ‌త కొంత‌ కాలంగా పెట్రోలియం యూనివ‌ర్శిటీ గురింది దేశ వ్యాప్తంగా ఎక్క‌డ కేటాయించాల‌న్న సంద‌గ్దత‌కు నేడు చెక్ ప‌డింది. నాలుగు రాష్ట్రాలు పెట్రోలియం యూనివ‌ర్శిటీ కోసం పోటీ ప‌డిన చివ‌రకి ఆంధ్రప్రదేశ్ లోనే యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణ‌యం జ‌రింది.

 మంగళవారం ఉద‌యం లోక్‌స‌భ‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై చర్చ జ‌రిగింది. ఎంపీలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్ట‌డానికి అమోదం తెలిపారు. దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో యూనివ‌ర్శీటీకి రూట్ పూర్తిగా క్లీయర్ అయిన‌ట్లే.

కేంద్ర ప్రభుత్వం AP పునర్వవ్వ‌స్థిక‌ర‌ణ‌లో భాగంగా చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి పెట్రోలియం విశ్వవిద్యాలయానికి ముందుకు వెళ్లాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

పెట్రోలియం యూనిర్శిటీని విశాఖపట్నంలోని సబ్బవరం మండల్లోని అనంతపల్లి గ్రామంలో 200 ఎకరాలలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయ్య‌బోతున్నారు. క్యాంప‌స్‌ ఏర్పాటు చేయటానికి, కేంద్ర ప్రభుత్వం నుండి రూ 655.46 కోట్లు కేటాయించ‌నుంది. ఇన్స్టిట్యూట్ లిక్విఫైడ్ సహజ వాయువు, జీవ ఇంధనాలు మరియు పునరుద్ధరణలు వంటి రంగాల్లో పరిశోధన మరియు అభివృద్ధిని కొనసాగిస్తుంది.

click me!