ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి.. 2019లో మోటారూ చెడిపోతుంది

Published : Sep 19, 2017, 09:38 AM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి.. 2019లో మోటారూ చెడిపోతుంది

సారాంశం

‘‘భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా మొత్తం టిడిపినే గెలుస్తుంది’’...‘‘నంద్యాల ఉపఎన్నికతో ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి’’..ఇవి తాజాగా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న లోకేష్ మాట్లాడుతూ, ప్ధానిక ఎన్నికల నుండి అసెంబ్లీ ఎన్నికల వరకూ తెలుగుదేశం హవా మాత్రమే ఉంటుందని జోస్యం చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో రెక్కలు మాత్రమే విరిగిపోయిన ఫ్యాన్ కు 2019 ఎన్నికల్లో ఫ్యాన్ మోటారు క్రింద పడిపోతుందన్నారు.

‘‘భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా మొత్తం టిడిపినే గెలుస్తుంది’’...‘‘నంద్యాల ఉపఎన్నికతో ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి’’..ఇవి తాజాగా నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న లోకేష్ మాట్లాడుతూ, ప్ధానిక ఎన్నికల నుండి అసెంబ్లీ ఎన్నికల వరకూ తెలుగుదేశం హవా మాత్రమే ఉంటుందని జోస్యం చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో రెక్కలు మాత్రమే విరిగిపోయిన ఫ్యాన్ కు 2019 ఎన్నికల్లో ఫ్యాన్ మోటారు క్రింద పడిపోతుందన్నారు. శ్రీకాకుళం జిల్లా అంటే తన తండ్రి చంద్రబాబునాయుడుకు చాలా ఇష్టమని కాబట్టి వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే ఓట్లు వేయాలంటూ ప్రజలకు చెప్పారు.

పనిలో పనిగా దేశంలో ఏ రాష్ట్రమూ చేయని విధంగా రూ. 25 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత కూడా తమకే దక్కుతుందని చెప్పారు. ఇక్కడే చంద్రబాబు కానీ లోకేష్ కానీ మాట్లాడుతున్న మాటలు అర్ధం కావటం లేదు. ఏంటంటే, 2014 ఎన్నికల సమయంలో రైతు రుణమాఫీ హామీనిచ్చింది దేశం మొత్తం మీద చంద్రబాబు మాత్రమే. కాబట్టి హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా చంద్రబాబుపైనే ఉంటుంది. దేశం మొత్తం  మీద రైతు రుణమాఫీ చేస్తున్న రాష్ట్రం ఏపి మాత్రమే అనే మాటలో అర్ధమే లేదు.  హామీ ఇచ్చింది చంద్రబాబైతే  మిగితా రాష్ట్రాలకు ఏం సంబంధం? మిగితా రాష్ట్రాల్లో రైతు రుణమాఫీ ఎందుకు అమలవుతుంది?  

ఇక, రాష్ట్రానికి ఐటి పరిశ్రమలను తీసుకు వచ్చే బాధ్యతను ఇద్దరం అంటే, లోకేష్ తో పాటు శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్ నాయడు తీసుకోవాలట. విచిత్రంగా లేదు. ఐటి పరిశ్రమలను తీసుకురావటమంటే అదేదో వాళ్ళ ఇంటి వ్యవహారం అన్నట్లుగా లోకేష్ మాట్లాడుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ | Asianet News Telugu
Vijayawada Police Press Conference: 2025 నేర నియంత్రణపై పోలీస్ కమీషనర్ ప్రెస్ మీట్| Asianet Telugu