పప్పా? అవినీతిపరుడా? తేల్చాలట.....

Published : May 03, 2017, 02:32 AM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
పప్పా? అవినీతిపరుడా? తేల్చాలట.....

సారాంశం

‘తాను పప్పా....లేక అవినీతిపరుడినా’? ముందు రెండింటిలో ఏదో ఒకటి తేల్చాలట. వైసీపీ, ప్రతిపక్షాలు తనను పప్పు అని అవినీతిపరుడినని విమర్శిస్తున్నాయని, అందులో ఏదో ఒకటి తేల్చాలన్నారు.

నారా లోకేష్ పెద్ద ప్రశ్నే వేశారు. మహాభారతంలో పాండవులు జూదంలో ఓడిపోయినపుడు ద్రౌపది వేసిన ప్రశ్నలాంటిదే ఇది కూడా. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటే...‘తాను పప్పా....లేక అవినీతిపరుడినా’? ముందు రెండింటిలో ఏదో ఒకటి తేల్చాలట. వైసీపీ, ప్రతిపక్షాలు తనను పప్పు అని అవినీతిపరుడినని విమర్శిస్తున్నాయని, అందులో ఏదో ఒకటి తేల్చాలన్నారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో మాట్లాడుతూ, తన బాధను, పరిస్ధితిని మీడియాతో చెప్పుకుని వాపోయారు.

అయితే, తనపై ఎంత దుష్ర్పచారం చేసినా తాను మాత్రం పనిచేసి చూపిస్తున్నామన్నారు. మంత్రిపదవి చేపట్టిన నెల రోజుల్లో 1650 ఐటి ఉద్యోగాలు సృష్టించానని చెప్పుకొచ్చారు. అయితే 1650 ఉద్యోగాలు ఏ కంపెనీల్లో సృష్టించారో మాత్రం చెప్పలేదు.

ఇక లండన్ పర్యటనకు తాను వెళ్లటంలేదని అయినా తాను వెళుతున్నట్లు గతంలో జీఓ ఎందుకు విడుదలైందో తెలియటం లేదని చెప్పటం కొసమెరుపు. కాకపోతే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరువు, రైతు సమస్యల తదితర కారణాల వల్ల తండ్రి, కొడుకులు ఇద్దరూ అమెరికా పర్యటనకు వెళితే విమర్శలు వస్తాయన్న ఉద్దేశ్యంతోనే లోకేష్ ఆగిపోయినట్లు సమాచారం.

 

 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu