ఆయన పేరు లోకేష్ కాదు, లో‘క్యాష్’ : జగన్ దాడి

Published : May 02, 2017, 12:36 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
ఆయన పేరు  లోకేష్ కాదు, లో‘క్యాష్’ : జగన్ దాడి

సారాంశం

 అన్నింటికి  ఆయన క్యాష్   తీసుకుంటారు. ఆయన లోకేశ్ కాదు, లో ‘క్యాష్’

ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఐటి మంత్రి లోకేశ్ ను పెద్దగా విమర్శించ లేదు. ఆ పని రోజా వంటి ఎమ్మెల్యేలు చేస్తూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేశ్ మాత్రం జగన్ ను తీవ్రంగా విమర్శిస్తూ వచ్చారు. అయితే, ఈ రోజు గుంటూరు రెండురోజుల రైతు దీక్ష  ముగింపు సందర్భంగా జగన్  లోకేశ్ వదల్లేదు. లోకేశ్ మీద  ఏక శబ్ద విమర్శ చేశారు.ఇది దాదాపు లోకేశ్ పునర్నామకరణం లాగా అయింది.

 

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పేరు లోకేశ్ కాదు లో‘క్యాష్’ అన్నారు.

 

పార్టీ లో  ఉన్నపుడు జగన్ లోకేశ్ ను ఎపుడూ ఖాతరు చేయ లేదు. అయితే, లకేశ్ ఇపుడు ఎమ్మెల్సీ. అంతేకాదు, ప్రభుత్వంలో చాలా కీలకమయిన రెండు పదవులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఒకటి ఐటి శాఖ, రెండోది పంచాయతీ రాజ్.

 

కాబట్టి లోకేశ్ చేసే ప్రతిపని  రాష్ట్రం మీద  ప్రభావం చూపుతుంది కాబట్టి ఇక కుర్రకుంక అని వదిలేయదలుచుకోలేదని పిస్తుంది. అందుకే లోకేశ్ మీద తీవ్రమయిన దాడి చేశారు.

 

‘ఇక చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ ప్రతి విషయంలోనూ డబ్బు తీసుకుంటారు.  ఆయన పేరు లోకేష్‌ కాదు లో‘క్యాష్‌’ అని టీడీపీ నేతలే అంటున్నారు,’ అని అన్నారు.

 

ఇక వైౌసిపి నేతలు ఈ  లో‘క్యాష్ ’ వూరూర, వాడ వాడ తీసుకెళ్లే  ప్రమాదం ఉంది.

 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu