జగన్ తో బహిరంగ చర్చకు లోకేష్ స్థాయి సరిపోదు.. మోపీదేవి (వీడియో)

Published : Sep 16, 2023, 12:02 PM ISTUpdated : Sep 16, 2023, 02:47 PM IST
జగన్ తో బహిరంగ చర్చకు లోకేష్ స్థాయి సరిపోదు.. మోపీదేవి (వీడియో)

సారాంశం

నారా లోకేష్ మీద ఎంపీ మోపీదేవి వెంకటరమణ విరుచుకుపడ్డారు. చంద్రబాబు అవినీతి గురించి అందరికీ తెలుసన్నారు. జగన్ తో చర్చకు లోకేష్ స్థాయి సరిపోదని ఎద్దేవా చేశారు. 

బాపట్ల జిల్లా :  చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు సీఐడీ స్పషమైన ఆధారాలు చూపించబట్టే చంద్రబాబు రిమాండ్ కు వెళ్లాడని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. టిడిపి తన అనుకూల మీడియా ద్వారా చంద్రబాబు ఎటువంటి తప్పు చేయలేదనే ఒక గ్లోబల్ ప్రచారాన్ని చేస్తున్నారని.. వాస్తవాలను ఎవరు గ్రహించడం లేదనుకుంటున్నారని అన్నారు.  

చట్టానికి ఎవరూ చుట్టాలు కాదన్నారు. చంద్రబాబు గురించి పార్లమెంట్లో చర్చిస్తామని లోకేష్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జాతీయస్థాయిలో చంద్రబాబు బండారం అందరికీ తెలిసిందే అన్నారు.  హైటెక్ స్థాయిలో అవినీతికి ఎలా పాల్పడాలో చంద్రబాబుకు తెలిసినట్లు ఎవరికీ తెలియదని విమర్శించారు.  

రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ప్రత్యేక వైద్య బృందం.. పూర్తి వివరాలు ఇవే..!!

ఎప్పటికైనా పాపాల పుట్ట పగులుతుందన్నారు. చంద్రబాబు రిమాండ్ పై జగన్మోహన్ రెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధమని లోకేష్ చెబుతున్నాడని.. లోకేష్ స్థాయికి జగన్ కాదు మా కార్యకర్తలు చాలు అని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డితో బహిరంగ చర్చకు లోకేష్ స్థాయి సరిపోదన్నారు. 

రేపల్లె మండలం పోటుమెరక గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎంపీ మోపిదేవి వెంకటరమణ రావు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ఎంపీ మోపిదేవి ప్రజలకు వివరించారు. దీంట్లో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఆట బొమ్మలను అందింజేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు