లోకేష్కు ఫుల్లు డిమాండ్

Published : Apr 01, 2017, 02:01 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
లోకేష్కు ఫుల్లు డిమాండ్

సారాంశం

జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యునికన్నా చంద్రబాబునాయుడు కొడుకన్నదే అన్నింటికన్నా పెద్ద పదవి కదా? కాబట్టే లోకేష్ కు అంత డిమాండ్.

లోకేష్ కు డిమాండ్ ఫుల్లుగా పెరిగిపోతోంది. ఎంతలా అంటే మంత్రి పదవుల కోసం ఆశావహులు ప్రదక్షిణాలు చేసేంతగా. పార్టీలో పదవులు కావాలనుకునే వారు, ప్రభుత్వంలో పోస్టులు కావాలనుకునే వారు లోకేష్ చుట్టు తిరిగుతున్నారంటే ఓకే. కానీ మంత్రివర్గంలో చోటు కావాలనుకునే వారు కూడా చివరకు లోకేష్ చుట్టూ తిరగాల్సి వస్తోంది. జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యునికన్నా చంద్రబాబునాయుడు కొడుకన్నదే అన్నింటికన్నా పెద్ద పదవి కదా? కాబట్టే లోకేష్ కు అంత డిమాండ్. చంద్రబాబు కొడుకు హోదాతో పోల్చుకుంటే నిజానికి మంత్రి పదవి కూడా లోకేష్ కు చిన్నదే.

అందుకనే త్వరలో జరుగుతుందనుకుంటున్న మంత్రివర్గ విస్తరణలో చోటు కోసం చిన్నబాబు దయ కోసం సీనియర్లు కూడా ప్రదక్షిణాలు చేయక తప్పటం లేదు. మంత్రివర్గం కూర్పుపై ఓ వైపు చంద్రబాబు, మరోవైపు చినబాబు కసరత్తులు చేస్తున్నారు. ఇద్దరూ విడివిడిగానే కాకుండా కలివిడిగా కూడా కసరత్తు చేస్తున్నారు. అందుకనే, లోకేష్ ప్రాపకం కోసం ఎంతో సీనియర్లైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పల్లె రఘునాధరెడ్డి, పయ్యావుల కేశవ్, టిడి జనార్ధన్ రావు, పీతల సుజాత తదితరులు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

లోకేష్ ను కలుస్తున్నవారిలో మంత్రిపదవులు కావాలనే వారితో పాటు మంత్రివర్గంలో కొనసాగించమనే వారు కూడా ఉంటున్నారు. చంద్రబాబును కలుస్తున్నవారితో పాటు కలవటానికి అవకాశం దక్కని వారు కూడా ఎందుకైనా మంచిదని లోకేష్ ను కూడా కలిసి ఓ దండం పెట్టుకుని వెళుతున్నారు. 2వ తేదీనే ముహూర్తం ఫిక్స్ అయిందని ప్రచారం బాగా జరుగుతోంది. మంత్రివర్గంలో 25 మంది ఉంటారని, ఏర్పాటయ్యేది ఎన్నికల క్యాబినెట్ అని ప్రచారం బాగా జరుగుతోంది. దానికితోడు శుక్రవారం అర్ధరాత్రి తరువాత చంద్రబాబు, చినబాబులిద్దరూ ఎవ్వరినీ కలవటం లేదనే ప్రచారం కూడా తోడవ్వటంతో  లోకేష్ కార్యాలయంలో విపరీతమైన సందడి కనబడుతోంది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే
Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి