హైదరాబాద్ ను మరచిపోయిన లోకేష్

First Published Apr 18, 2017, 9:44 AM IST
Highlights

పల్లె, పట్నం పోలికలు వరకూ బాగానే ఉంది. మరి ఇటీవలే కట్టుకున్న సొంతింటిని మెట్రో నగరమైన హైదరాబాద్ లో ఎందుకు కట్టుకున్నట్లు? లోకేష్ పోలిక ప్రకారమే హైదరాబాద్ ను దేనితో పోల్చాలి?

పంచాయితీరాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ కొత్త విషయాలు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న లోకేష్ మాట్లాడుతూ, పల్లె కన్నతల్లి లాంటిదట. పట్నమేమో ప్రియురాలు లాంటిదని చెప్పారు. కన్నతల్లి లాంటి పల్లెలను బాగు చేయటానికే తాను పంచాయితీరాజ్ శాఖను తీసుకున్నట్లుగా కూడా శెలవిచ్చారు. ప్రతీ గ్రామంలో సిమెంట్ రోడ్లు నిర్మించి తాగునీరు, విద్యుత్ సమస్యలు లేకుండా చేస్తానని హామీలు కూడా ఇచ్చేసారు.

సరే వచ్చే ఐదేళ్ళల్లో ఐటి రంగంలో లక్ష ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమన్న నినాదం ఒకటుందిగా. తమకు అధికారం ఉండేది ఇక రెండేళ్లేనని. మళ్ళీ అధికారంలో ఉండాలంటే ఎన్నికల్లో గెలవక తప్పదన్న విషయం మరచిపోయినట్లున్నారు. పల్లె, పట్నం పోలికలు వరకూ బాగానే ఉంది. మరి ఇటీవలే కట్టుకున్న సొంతింటిని మెట్రో నగరమైన హైదరాబాద్ లో ఎందుకు కట్టుకున్నట్లు? లోకేష్ పోలిక ప్రకారమే హైదరాబాద్ ను దేనితో పోల్చాలి?

click me!