వైసీపీ నేతలు..‘నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్’

Published : Oct 25, 2017, 03:12 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
వైసీపీ నేతలు..‘నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్’

సారాంశం

‘ప్రతిపక్ష పార్టీ ఎంఎల్ఏ, ఎంపిలు ఎన్ఆర్ ఏలు’..ఇది తాజాగా నారా లోకేష్ వైసీపీ నేతలలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య. విదేశాల్లో నివసించే భారతీయులను ఎన్ఆర్ఐ అటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఎన్ఆర్ఏ అన్న కొత్త పదాన్ని లోకష్ కనిపెట్టారు.

‘ప్రతిపక్ష పార్టీ ఎంఎల్ఏ, ఎంపిలు ఎన్ఆర్ ఏలు’..ఇది తాజాగా నారా లోకేష్ వైసీపీ నేతలలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య. విదేశాల్లో నివసించే భారతీయులను ఎన్ఆర్ఐ అటారన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఎన్ఆర్ఏ అన్న కొత్త పదాన్ని లోకష్ కనిపెట్టారు. ఇంతకీ ఎన్ఆర్ఏ అంటే ఏమిటంటే, నాన్ రెసిడెంట్ ఆంధ్రా అట. ఏపిలో ప్రజాప్రతినిధులుగా గెలిచి హైదరాబాద్ లోనే ఉంటున్నారని లోకేష్ వైసీపీ ప్రజాప్రతినిధులను ఎద్దేవా చేసారు. ఇక్కడే లోకేష్ ఓ విషయం మరచిపోయినట్లున్నారు.

వైసీపీ నేతలను ఎన్ఆర్ఏలుగా ఎద్దేవా చేస్తున్న లోకేష్ మరి, తన ఇల్లు ఎక్కడుందో చెప్పాలి. తన తల్లి, తన భార్య, కొడుకు ఎక్కడుంటున్నారు? తను, తన తండ్రి తరచూ ఎందుకు హైదరాబాద్ వస్తున్నట్లు? వీరిద్దరే కాదు ఏపి టిడిపి నేతల్లోని 90 శాతం మందికి ఆస్తులు, వ్యాపారాలు హైదరాబాద్ లోనే ఉన్న విషయం నిజం కాదా? వారికి హైదరాబాద్ లో ఇళ్ళు లేవా ? వారెవరూ హైదరాబాద్ కు రావటం లేదా?

యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ బండారాన్ని రేవంత్  బయటపెట్టింది అదే కదా? మరి దాని గురించి మాత్రం లోకేష్ ఎందుకు ఇప్పటి వరకూ నోరిప్పలేదు ? మొత్తానికి తేలిందేమంటే టిడిపి వాళ్ళది గురివింద గింజ నీతని. ఎన్ఆర్ఏలంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు తమకు కూడా వర్తిస్తాయని మరచిపోయినట్లున్నారు.  

 

 

PREV
click me!

Recommended Stories

Holidays : జనవరి 2026 లో ఏకంగా 13 రోజులు సెలవులే.. అన్నీ లాంగ్ వీకెండ్స్..!
CM Chandrababu Naidu Speech | సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు నాయుడు | Asianet News Telugu