లోకేష్ కు ఓ అభిమాని దిమ్మతిరిగే లేఖ

Published : Oct 25, 2017, 10:58 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
లోకేష్ కు ఓ అభిమాని దిమ్మతిరిగే లేఖ

సారాంశం

నారా లోకేష్ కు గోదావరి జిల్లా నుండి ఓ అభిమాని దిమ్మతిరిగే లేఖ రాసారు. దాన్ని నేరుగా లోకేష్ కు అందించే అవకాశం లేకపోవటంతో సోషల్ మీడియాను వేదికగా వాడుకున్నారు.

నారా లోకేష్ కు గోదావరి జిల్లా నుండి ఓ అభిమాని దిమ్మతిరిగే లేఖ రాసారు. దాన్ని నేరుగా లోకేష్ కు అందించే అవకాశం లేకపోవటంతో సోషల్ మీడియాను వేదికగా వాడుకున్నారు. తనకు టిడిపితో సంబంధమేమీ లేకపోయినా గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు విని తానే కాకుండా తన కుటుంబంతో పాటు స్నేహితులతో కూడా టిడిపికి ఓట్లు వేయించారట.

కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పాలన చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. ఎన్నికల ముందు చెప్పినదానికి, ఇపుడు జరుగుతున్నదానికి పొంతనే లేదన్నారు. మూడున్నరేళ్ళ పాలనా వైఫల్యాల గురించి విపులంగా వివరించారు లేఖలో.

అభిమాని అభిప్రాయంలో రాష్ట్రాభివృద్ధి మొత్తం కాగితాల మీదే ఉంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం మరొకటి లేదని అనుకోవటం ఉత్త భ్రమగా తేల్చేసాడు. ప్రజలకు అర్ధం కాకుండా అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తున్న మీ తెలివిని మించిన వారు కూడా సమాజంలో ఉన్నారని చెప్పారు. వారు గొంతు విప్పినా లేకపోతే ప్రజలకు నిజాలు తెలిసినా ప్రత్యామ్నాయాన్ని సృష్టించుకోవటం జనాలకు చిటికేసినంత తేలిక అంటూ స్పష్టం చేసారు.  

                                                      అభిమాని లేఖను యధాతధంగా క్రింద చదువుకోవచ్చు...

 

 

PREV
click me!

Recommended Stories

చేతుల మీద కర్పూరం వెలిగించి హారతి ఇచ్చిన మహిళ | CBN Full Speech At House Pattas Distribution
మహిళ స్పీచ్ కి దండంపెట్టేసిన బాబు | Chandrababu Giving House Pattas To Beneficiaries