తెలుగువారి ఆత్మ గౌరవాన్ని మరోసారి దెబ్బతీశారు.. లోకేష్

Published : Nov 01, 2018, 11:31 AM IST
తెలుగువారి ఆత్మ గౌరవాన్ని మరోసారి దెబ్బతీశారు.. లోకేష్

సారాంశం

తెలుగువారి ఆత్మగౌరవాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి దెబ్బతీసిందని ఏపీ మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. 

తెలుగువారి ఆత్మగౌరవాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి దెబ్బతీసిందని ఏపీ మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఐక్యతా ప్రతిమ ఏర్పాటులో తెలుగు భాషను విస్మరించడంపై లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

‘‘ప్రపంచంలోనే ఎత్తైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటు చెయ్యడంలో మోడీ జీ సఫలీకృతం అయ్యారు. కానీ   పటేల్ సమైక్య స్ఫూర్తి ని కాపాడటంలో మోడీ విఫలం అయ్యారు. ఐక్యతా ప్రతిమ ఏర్పాటులో తెలుగుని విస్మరించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని బీజేపీ మరో సారి దెబ్బతీసింది. ’’ అని లోకేష్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇదే విషయంపై సీఎం చంద్రబాబు కూడా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 

read more news

నా మనసు క్షోభిస్తోంది.. చంద్రబాబు ఆవేదన

PREV
click me!

Recommended Stories

Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి
IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!