ఫోన్ ట్యాపింగ్‌ఫై రఘురామ ఫిర్యాదు.. ఏపీ ప్రభుత్వానికి లోక్‌సభ సెక్రటేరియట్ నోటీసులు

By Siva KodatiFirst Published Nov 15, 2022, 8:57 PM IST
Highlights

ఫోన్ ట్యాపింగ్‌పై  నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేసిన ఫిర్యాదును లోక్‌సభ సచివాలయం పరిగణనలోనికి తీసుకుంది. దీనిలో భాగంగా ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

తన ఫోన్ ట్యాప్ అవుతోందంటూ నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేసిన ఫిర్యాదుపై లోక్‌సభ సచివాలయం స్పందించింది. దీనిపై 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని బుధవారం ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ స్పీకర్ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. కాగా.. తన ఫోన్‌ను ఏపీకి చెందిన అధికారులు ట్యాపింగ్ చేస్తున్నారంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈ నెల 8న లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. 

అంతకుముందు నవంబర్ 5న రఘురామ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు రోడ్ షోలో జనప్రభంజనం కనిపించిందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఆరు గంటలు ఆలస్యమైనా చంద్రబాబు కోసం జనం వెయిట్ చేశారని అన్నారు. తమ పార్టీ (వైసీపీ) భవిష్యత్ ముఖచిత్రం తనకు కనిపిస్తోందని చెప్పారు. వై నాట్ 175 అని జగన్ మోహన్ స్లోగన్ ఇస్తున్నారని.. కానీ వై నాట్ 175 ప్రతిపక్షానికి అని తనకు అనిపిస్తోందని చెప్పారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత క్రమంగా బయటపడుతుందని అన్నారు. చంద్రబాబు నాయుడు సభలకు భారీగా జనం వస్తున్నారని.. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. 

ALso REad:జగన్ బెయిల్ రద్దుకు సరైన కారణాలు లేవు... రఘురామ పిటిషన్ కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు..

చంద్రబాబు మీద లైట్లు ఆపి రాళ్లేశారని.. పవన్ కల్యాణ్ విశాఖ వెళ్లినప్పుడు కూడా లైట్లు ఆపేశారని అన్నారు. మరి ఏం చేద్దామని అనుకున్నారో తెలియదని అన్నారు. ఎవరైనా రెక్కీ, రాళ్లు వారిపైన వారే వేసుకుంటారా? అని ప్రశ్నించారు. రేపు కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేయదా అని ప్రశ్నించారు. అందరూ మన కోడికత్తి లాగా డ్రామాలు చేసేస్తారా? అని ప్రశ్నించారు. చిన్నాయన హత్య, కోడికత్తి మీదే కదా వైసీపీ ఎన్నికల్లో నెగ్గింది అని  అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పథకం ప్రకారం తమ వాళ్లు అరెస్ట్ చేస్తారని.. ఈ అక్రమ అరెస్ట్‌లు ఇంకెన్నాళ్లు అని ప్రశ్నించారు. మంత్రి జోగి రమేష్ ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

click me!