175 సీట్లు సాధించడం కష్టం కాదు.. విశాఖ నార్త్ నియోజకవర్గ కార్యకర్తలతో జగన్

By Siva KodatiFirst Published Nov 15, 2022, 7:57 PM IST
Highlights

తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విశాఖ నార్త్ నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 98 శాతానికి పైగా హామీలు అమలు చేశామని.. 175 సీట్లు గెలవడం పెద్ద కష్టమేమీ కాదన్నారు.

175 సీట్లు గెలవడం పెద్ద కష్టమేమీ కాదన్నారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్. మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విశాఖ నార్త్ నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చామని, పారదర్శకంగా పాలన చేస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 98 శాతానికి పైగా హామీలు అమలు చేశామన్నారు జగన్.  గ్రామాల్లో వ్యవసాయం తీరు మారుతోందని.. డిజిటల్ లైబ్రరీలు వస్తున్నాయన్నారు.  

విశాఖపట్నం రాష్ట్రంలోనే అతిపెద్ద నగరమని.. ఇక్కడి నార్త్ నియోజకవర్గంలోనూ 76 శాతం ఇళ్లలో మన పథకాలు కనిపిస్తున్నాయని జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వ పారదర్శకతతో ప్రతి ఇంటికి పథకాలు చేరుతున్నాయని.. అలాంటప్పుడు మరో 30 ఏళ్లు మన ప్రభుత్వమే వుండాలని ప్రజలు దీవిస్తారని సీఎం అన్నారు. నలుగురికి మంచి చేయాలంటే. ముందు మనం అధికారంలో వుండాలని జగన్ వ్యాఖ్యానించారు. 

ALso Read:విశాఖ నార్త్‌పై సీఎం జగన్ గురి.. కాసేపట్లో కార్యకర్తలతో భేటీ

ఇకపోతే.. అక్టోబర్ 19న అద్దంకి నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై ప్రతి అడుగూ ఎన్నికల దిశగానే వుండాలన్నారు. అందరం కలిసికట్టుగా 175కి 175 సీట్లు సాధిద్దామన్న ఆయన.. అదేమి పెద్ద కష్టం కాదని వ్యాఖ్యానించారు. 19 నెలలలో ఎన్నికలు వస్తున్నాయని సీఎం జగన్ గుర్తుచేశారు. అద్దంకి నియోజకవర్గానికి గడిచిన మూడేళ్లలో రూ.1,081 కోట్లు ఇచ్చామని సీఎం తెలిపారు. 

అంతకుముందు ఈ నెల 13న కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన వైసీపీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఏడాదిన్నరలో ఎన్నికలు వస్తున్నాయని.. ఈరోజు నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని జగన్ సూచించారు. కలిసికట్టుగా పనిచేస్తేనే విజయం సాధిస్తామని.. దీనిలో భాగంగా గడపగడపకూ కార్యక్రమాన్ని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో చేపడుతున్నామని జగన్ తెలిపారు. ఎమ్మెల్యేలు సంబంధిత నియోజకవర్గాల్లో తిరుగుతున్నారని... గ్రామంలో ప్రతీ ఇంటికి వెళ్తున్నారని సీఎం చెప్పారు. ప్రభుత్వంలో వున్న మనం.. గ్రామ స్థాయిల్లో కూడా బాధ్యతలను నిర్వహిస్తున్నామని జగన్ అన్నారు.

click me!