విశాఖలో లాకప్‌డెత్.. అలాంటిదేం లేదంటున్న పోలీసులు..!!

By sivanagaprasad KodatiFirst Published 12, Sep 2018, 8:52 AM IST
Highlights

విశాఖ సెంట్రల్ క్రైం స్టేషన్లో లాకప్‌డెత్ జరిగినట్లుగా వదంతులు వినిపిస్తున్నాయి. విజయనగరం స్టేడియం వీధికి చెందిన గొర్లె పైడిరాజుపై ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాదాపు 80కి పైగా చోరీ కేసులు ఉన్నాయని తెలుస్తోంది. 

విశాఖ సెంట్రల్ క్రైం స్టేషన్లో లాకప్‌డెత్ జరిగినట్లుగా వదంతులు వినిపిస్తున్నాయి. విజయనగరం స్టేడియం వీధికి చెందిన గొర్లె పైడిరాజుపై ఉత్తరాంధ్ర జిల్లాల్లో దాదాపు 80కి పైగా చోరీ కేసులు ఉన్నాయని తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం ఇతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా కొన్ని నేరాలు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అయితే సోమవారం అర్థరాత్రి ఇతను కస్టడీలోనే చనిపోయినట్లుగా తెలుస్తోంది.

అయితే ఈ వార్తలను పోలీసులు ఖండిస్తున్నారు... అతనిని అదుపులోకి తీసుకున్న మాట వాస్తవమేనని.. కానీ విచారణ చేయడం వీలు కాకపోవడంతో అతని భార్యను పిలిచి మళ్లీ స్టేషన్‌కు వచ్చే హామీపై వదిలిపెట్టామని అంటున్నారు. మరి అతను ఎలా చనిపోయినట్లు....

మరోవైపు పైడిరాజు మరణించి ఉంటే అతని మృతదేహం ఎక్కడుందన్న విషయం మిస్టరీగా మారింది. తమ కుమారుడు ఈ మధ్యకాలంలో విజయనగరం రాలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు.. అయితే నిందితుడి భార్య కుమారి, అత్త సత్యవతి కూడా కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.. ఏం జరిగిందన్నది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

Last Updated 19, Sep 2018, 9:23 AM IST